ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రాజ్యాంగాన్ని వైసీపీ అగౌరవపరుస్తోంది

ABN, Publish Date - Nov 27 , 2024 | 06:37 AM

అసెంబ్లీకి వెళ్లకుండా వైసీపీ రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తోందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు.

  • అసెంబ్లీకి వెళ్లని వాళ్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి: షర్మిల

అమరావతి, విజయవాడ, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీకి వెళ్లకుండా వైసీపీ రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తోందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. రాజ్యాంగాన్ని కాపాడాలని కోరుతూ పీసీసీ, సిటీ కాంగ్రెస్‌ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఆంధ్రరత్న భవన్‌ నుంచి బందరు రోడ్డులోని అంబేడ్కర్‌ స్మృతి వనం వరకు పాదయాత్ర జరిగింది. ‘శాసనసభ్యులు అసెంబ్లీకి వెళ్లాలని రాజ్యాంగం చెబుతోంది. కానీ, జగన్‌ తనకు ప్రతిపక్ష నేత హోదా దక్కలేదన్న సాకుతో అసెంబ్లీకి వెళ్లడం లేదు. సభకు వెళ్లనివాళ్లు రాజ్యాంగం మేరకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి’ అని షర్మిల డిమాండ్‌ చేశారు. ‘అదానీని బీజేపీ కాపాడుతోంది. వెంటనే విచారణ కమిటీ వేయాలని చంద్రబాబును డిమాండ్‌ చేస్తున్నాం’ అని షర్మిల అన్నారు.

Updated Date - Nov 27 , 2024 | 06:37 AM