ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రామాయపట్నంలో పెట్రో హబ్‌!

ABN, Publish Date - Nov 22 , 2024 | 03:29 AM

నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం పోర్టులో పెట్రో కెమికల్‌ హబ్‌ ఏర్పాటుకు మార్గం దాదాపుగా సుగమం అయింది. ప్రధాని మోదీ., ముఖ్యమంత్రి చంద్రబాబు మైత్రి ప్రభావం నెల్లూరు జిల్లాలో భారీ పరిశ్రమల స్థాపనకు నాంది పలకనుంది.

  • రూ.65 వేల కోట్లతో ఏర్పాటుచేయనున్న బీపీసీఎల్‌

  • తీవ్ర కసరత్తు తర్వాత కేంద్రం మొగ్గు రామాయపట్నం వైపే

  • ఢిల్లీ స్థాయిలో మొదలైన సన్నాహాలు

నెల్లూరు, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం పోర్టులో పెట్రో కెమికల్‌ హబ్‌ ఏర్పాటుకు మార్గం దాదాపుగా సుగమం అయింది. ప్రధాని మోదీ., ముఖ్యమంత్రి చంద్రబాబు మైత్రి ప్రభావం నెల్లూరు జిల్లాలో భారీ పరిశ్రమల స్థాపనకు నాంది పలకనుంది. భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌).. రూ.65 వేల కోట్ల భారీ పెట్టుబడులతో సిద్ధమవుతోంది. దీనిపై ఢిల్లీలో కదలిక మొదలయింది. అంతా అనుకున్నట్టే జరిగితే నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో ఉపాధి లభిస్తుంది. ప్రత్యక్షంగా 2,500 మందికి, అనుబంధ పరిశ్రమలవల్ల మరికొన్ని వేల మందికి అవకాశాలు దొరుకుతాయి. నిజానికి, ఇది విభజన హామీ. రాష్ట్రంలో పెట్రో కెమికల్‌ హబ్‌ను ఏర్పాటుచేస్తామని 2014లోనే కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర అభివృద్ధికి నిర్దిష్టమైన ప్రణాళికలు, కచ్చితమైన ప్రతిపాదనలతో ముందుకెళుతున్న చంద్రబాబు.. ఈ అంశంపై ఢిల్లీని కదిలించారు. విశాఖ సమీపంలోని పులిమడక వద్ద ఎన్‌టీపీసీ ఏర్పాటుచేస్తున్న గ్రీన్‌ హెడ్రోజన్‌ హబ్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నెల్లూరు జిల్లాలో అనువైన భూమిని గుర్తించే పనులు మొదలుపెట్టాయి. రామాయపట్నం పోర్టు ఉత్తరం వైపు తెట్టు గ్రామం వద్ద మూడు వేల ఎకరాల అటవీ శాఖ భూమి ఉంది. పోర్టుకు దక్షిణం వైపు కావలి నియోజవకర్గం తుమ్మలపెంట వద్ద విస్తారంగా ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో పెట్రోకెమికల్స్‌, రిఫైండరీ పరిశ్రమల స్థాపనకు ఏది అనువైనదో దానిని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. బీపీసీఎల్‌ రాకతో రామాయపట్నం కొత్త శోభను సంతరించుకుంటుందని పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Nov 22 , 2024 | 03:29 AM