ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ద్వారంపూడి అవినీతిపై విజిలెన్స్‌ విచారణ జరపాలి

ABN, Publish Date - Aug 20 , 2024 | 06:57 AM

ఇళ్ల స్థలాల భూసేకరణ, లేఅవుట్‌ అభివృద్ధి పేరుతో కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి చేసిన అవినీతి, అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ

  • మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో ఆందోళన

పిఠాపురం, ఆగస్టు 19: ఇళ్ల స్థలాల భూసేకరణ, లేఅవుట్‌ అభివృద్ధి పేరుతో కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి చేసిన అవినీతి, అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ కాకినాడ జిల్లా పిఠాపురంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.

కొత్తపల్లి మండలం కొమరిగిరిలో కాకినాడ నగర ప్రజల ఇళ్ల పట్టాల కోసమంటూ 350 ఎకరాల భూమిని సేకరించారని, దీనిని చదును చేయడం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చూపి భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. 13వేల మందికి ఇళ్లపట్టాలు ఇవ్వాలని చెప్పి తన బినామీలకు ఇళ్ల స్థలాలు కట్టబెట్టి విక్రయాలు జరిపారని, ఇందులో భారీ గోల్‌మాల్‌ జరిగిందన్నారు. కొత్తపల్లి మండల మత్స్యకారులకు, పేదలకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టరు షాన్‌మోహన్‌కు వినతిపత్రం అందజేశారు.

Updated Date - Aug 20 , 2024 | 06:57 AM

Advertising
Advertising
<