Fake Currency: పోలీస్ వాహనంపై దాడి.. ప్రధాన నిందితుడిని ఎత్తుకెళ్లిన ముఠా
ABN, Publish Date - Dec 14 , 2024 | 10:13 AM
తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో దారుణం చోటు చేసుకుంది. దొంగ నోట్ల వ్యవహారంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న ప్రధాని నిందితుడిని విడిపించి.. తీసుకు వెళ్లేందుకు ముఠా స్కెచ్ వేసింది.
రాజమండ్రి, డిసెంబర్ 14: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పోలీసుల వాహనంపై దొంగ నోట్ల ముఠా దాడి చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. శుక్రవారం అర్థరాత్రి రాజమండ్రిలో శ్రీకాకుళం జిల్లా పోలీసుల వాహనంపై దొంగ నోట్ల ముఠా దాడి చేసి.. ప్రధాన నిందితుడిని ఎత్తుకెళ్లాంది. డిసెంబర్ 12వ తేదీన దొంగ నోట్ల కేసులో ప్రధాన నిందితుడిని శ్రీకాకుళం జిల్లా పోలీసులు.. భీమవరంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని భద్రత మధ్య శ్రీకాకుళం తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
Also Read: దుర్గమ్మను దర్శించుకొన్న ఆర్ఎస్ఎస్ చీఫ్.. మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు
ఆ క్రమంలో పోలీస్ వాహనాన్ని రెండు కార్లు.. నాలుగు ద్విచక్ర వాహనాలతో దొంగ నోట్ల ముఠాకు చెందిన సభ్యులు వెంబడించారు. దీంతో గత ఆర్థరాత్రి రాజమండ్రి సమీపంలోని విఎల్ పురం వద్ద.. నిందితుడిని తీసుకు వెళ్తున్న పోలీసుల వాహనంపై ముఠా దాడికి తెగబడింది. అనంతరం ప్రధాన నిందితుడిని తమతో పాటు ముఠా సభ్యులు తీసుకు వెళ్లారు.
Also Read: అల్లు అర్జున్ అరెస్ట్‌పై చిన్ని కృష్ణ సంచలన వ్యాఖ్యలు
ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా పోలీసులు రాజమండ్రిలోని ప్రకాశ్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా పోలీసులు సీసీ ఫుటేజ్‌లను పరిశీలిస్తు్న్నారు. అలాగే ఇతర జిల్లాల పోలీసులను సైతం అప్రమత్తం చేశారు.
ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో దొంగ నోట్ల కలకలం మొదలైంది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ సందర్భంగా పలువురిని అదుపులోకి తీసుకుని విచారించారు. దింతో దొంగ నోట్ల కేసులో ప్రధాన నిందితుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో శ్రీకాకుళం పోలీసులు గురువారం భీమవరం చేరుకున్నారు.
నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని తీసుకుని శుక్రవారం రాత్రి శ్రీకాకుళం బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న దొంగ నోట్లు ముఠా సభ్యులు.. సదరు పోలీసుల వాహనాన్ని వెంబడించారు. అదను చూసి.. ఆ పోలీస్ వాహనంపై దాడి చేశారు.
ఆ తర్వాత పోలీసుల అదుపులో ఉన్న ప్రధాన నిందితుడిని.. తమ వాహనంలోకి ఎక్కించుకొని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఆ క్రమంలో వారిని పట్టుకొనేందుకు గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
For AndhraPradesh News And Telugu News
Updated Date - Dec 14 , 2024 | 10:13 AM