ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Political eclipse : శెట్టిపల్లె హైస్కూల్‌కు రాజకీయ గ్రహణం

ABN, Publish Date - Sep 15 , 2024 | 11:19 PM

వైసీపీ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన నాడు-నేడు పనులు నిర్వీ ర్యమై మంజూరైన రూ.64 లక్షల నిధులు మురిగి పోయాయి. రాజకీయ కారణాలతో విద్యార్థులకు కల్పించాల్సిన మౌలిక వసతులు కల్పించలేదు. ఫలితంగా నిత్యం విద్యార్థినీ, విద్యార్థులు అనేక రకా ల ఇబ్బందులు పడుతున్నారు.

మురుగును తలపిస్తున్న పాఠశాల ఆవరణ

రూ.64 లక్షలు నాడు- నేడు నిధులు వెనక్కి

మౌలిక వసతులకు విద్యార్థులు దూరం

కూటమి ప్రభుత్వంతో వసతులు సమకూరేనా

సంబేపల్లె, సెప్టెంబరు 15: వైసీపీ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన నాడు-నేడు పనులు నిర్వీ ర్యమై మంజూరైన రూ.64 లక్షల నిధులు మురిగి పోయాయి. రాజకీయ కారణాలతో విద్యార్థులకు కల్పించాల్సిన మౌలిక వసతులు కల్పించలేదు. ఫలితంగా నిత్యం విద్యార్థినీ, విద్యార్థులు అనేక రకా ల ఇబ్బందులు పడుతున్నారు. మారుమూల గ్రామీ ణ ప్రాంతమైన శెట్టిపల్లి జడ్పీహైస్కూల్‌లో 161 మంది పేద విద్యార్థులు చదువుతున్నా వారికి సరై న వసతులు కల్పించడంలో అధికారులు విఫలమ య్యారని చెప్పవచ్చు. వివరాల్లోకెళితే....

శెట్టిపల్లి జడ్పీహైస్కూల్‌లో 161 మంది పేద విద్యార్థులు చదువుతున్నారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల వైసీపీ ప్రభుత్వంలో మౌలిక వసతుల కింద నాడు-నేడు నిధులు రూ.64 లక్షలు మంజూరు చేశారు. రాజకీయ కారణాలతో వి ద్యార్థులకు కల్పించాల్సిన మౌలిక వసతులు కల్పించలేదు. వైపీపీ ప్రభుత్వంలో పాఠశాల స్కూల్‌ కమి టీ చైర్మెన్‌ టీడీపీ వ్యక్తి కావడంతో వైసీపీ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు ఖర్చు చేయకుండా వదిలేశారు. దీంతో నిధులు వెనక్కిపోయాయి. పాఠశాలలో విద్యార్థులు కనీస వసతులు లేక రోజూ అవస్థలు పడుతున్నారు.


పిచ్చిమొక్కలతో ఉన్న పాఠశాల ప్రాంగణం

పాఠశాలలో నెలకొన్న సమస్యలు

పాఠశాల చుట్టూ ప్రహరీ లేదు. దీంతో అసాంఘి క కార్యకలాపాలకు అడ్డాగా మారింది. వర్షం వస్తే తరగతి గదులు ఉరుస్తున్నాయి. తలుపులు, కిటికీ లు కూడా సక్రమంగా లేవు. పాఠశాలలో తాగునీటి సమస్య నెలకొంది. వంట గదులు, గోడల వరకు కట్టి వదిలేశారు. మొండి గోడలు పిచ్చిమొక్కల మధ్య ఆరుబయట వంట చేస్తున్నారు. మురుగు కాల్వల ద్వారా వచ్చే నీరు పాఠశాల ప్రాంగణలో చేరి మడుగును తలపిస్తున్నాయి. విద్యార్థులు ఆడుకునేందుకు ఆట స్థలం లేదు. బాలికలకు మరుగుదొడ్లు లేక ఆరుబయట అవస్థలు పడుతున్నారు. మూడో తరగతి నుంచి 10వతరగతి వరకు ఉన్న బాలికలు మరుగుదొడ్డిని కూడా సక్రమంగా లేక వినియోగించుకోవడం లేదు. పాఠశాలలో అన్నీ సమస్యలే దర్శనమిస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలోనైనా విద్యార్థుల కనీసం మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.

నిధులు వెనక్కిపోయాయి

పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యా బోధనలు అందిస్తున్నాం. ప్రతి సబ్జెక్టుకు ఉపాధ్యాయు లు ఉన్నారు. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలంటే కనీసం నిధులు కూడా లేవు. నాడు- నేడు నిధులు 64 లక్షల వెనక్కిపోయాయి. ప్రస్తుతం నిధులు మంజూరైతే విద్యార్థులకు వసతులు కల్పిస్తాం.

- చిన్నరెడ్డెప్ప, హెచ్‌ఎం, శెట్టిపల్లి

విద్యార్థులు అవస్థలు పడుతున్నారు

మారుమూల ప్రాంతం నుంచి వచ్చే ఆడపిల్లలు మరుగుదొడ్లు లేక ఆరుబయట వెళుతున్నారు. పిల్లల భద్రత లేకుండా పో యింది. వైసీపీ ప్రభుత్వంలో నాడు- నేడు కింద మంజూరైన నిధులను తిరిగి మంజూరు చేయాలి. పిల్లల సమస్యలు స్థానిక నేతలతో కలిసి మంత్రి దృష్టికి తీసుకెళ్తాం. పాఠశాలకు వసతులు కల్పిస్తాం.

- బాషావల్లి, స్కూల్‌ కమిటీ చైర్మెన్‌, శెట్టిపల్లి

Updated Date - Sep 15 , 2024 | 11:19 PM

Advertising
Advertising