ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఘనంగా క్రిస్మస్‌ పండుగ

ABN, Publish Date - Dec 25 , 2024 | 10:31 PM

చర్చిల్లో క్రిస్మస్‌ ప్రార్ధనలు, సంబరాలు అంబరాన్నంటాయి. బుధవారం సెయింట్‌ మార్క్స్‌ లూథరన్‌ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, లిడ్‌క్యాప్‌ చైౖర్మన్‌ పిల్లి మాణిక్యాలరావు, బాపట్ల పార్లమెంట్‌ సభ్యుడు, లోక్‌సభ ప్యానెల్‌ స్పీకర్‌ తెన్నేటి కృష్ణప్రసాద్‌ పాల్గొన్నారు. అందరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. పలు చర్చిల వద్ద వెలసిన చిరు దరుకాణాలతో రద్దీ ఏర్పడింది.

సెయింట్‌ మార్క్స్‌ లూథరన్‌ చర్చిలో ప్రార్థనల్లో ఎంపీ కృష్ణప్రసాద్‌ లూథరన్‌ చర్చిలో క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కొండయ్య, లిడ్‌క్యాప్‌ చైర్మన్‌ మాణిక్యాలరావు

ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎంపీ కృష్ణప్రసాద్‌, ఎమ్మెల్యే కొండయ్య,

లిడ్‌క్యాప్‌ చైర్మన్‌

చీరాల, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : చర్చిల్లో క్రిస్మస్‌ ప్రార్ధనలు, సంబరాలు అంబరాన్నంటాయి. బుధవారం సెయింట్‌ మార్క్స్‌ లూథరన్‌ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, లిడ్‌క్యాప్‌ చైౖర్మన్‌ పిల్లి మాణిక్యాలరావు, బాపట్ల పార్లమెంట్‌ సభ్యుడు, లోక్‌సభ ప్యానెల్‌ స్పీకర్‌ తెన్నేటి కృష్ణప్రసాద్‌ పాల్గొన్నారు. అందరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. పలు చర్చిల వద్ద వెలసిన చిరు దరుకాణాలతో రద్దీ ఏర్పడింది. పలుచోట్ల కేక్‌ కటింగ్‌లు జరిగాయి.

చీరాలటౌన్‌ : చీరాల పట్టణం, గ్రా మీణ ప్రాంతాల్లోని చర్చిల్లో ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు జరిగాయి. ఈసందర్భంగా మత బోధకులు ప్రార్థనలు ని ర్వహించారు. క్రైస్తవులు పాల్గొని క్రీస్తుని ఆరాధించారు. క్యాండిల్‌ సర్వీసు చే శారు. చిన్నారులు క్రీస్తు పుట్టుక నాటికతో పాటు పలు గానాలతో ఏసుని ఘనపరిచారు.

అద్దంకి : క్రిస్మస్‌ సందర్భంగా బుధవారం అద్దంకి పట్టణంలోని అన్ని చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పట్టణంలోని పసుమర్తిపాలెం, కట్టకిందపాలెం, బెరకానగర్‌, సంజీవనగర్‌, ఎన్టీఆర్‌నగర్‌, గరటయ్యకాలనీ, రామ్‌నగర్‌, ఎల్‌ఈఎఫ్‌ నగర్‌, మొండితోకపాలెం తదితర ప్రాంతాలలో ఉన్న చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. స్థానిక క్రిస్టియన్‌లు పెద్ద సంఖ్యలో ప్రార్థనల్లో పాల్గొన్నారు. కేక్‌ను కట్‌ చేసి పంచారు. మండలంలోని అన్ని గ్రామాలలో చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి.

బల్లికురవ : మండలంలోని అన్ని గ్రామాలలో క్రిస్మస్‌ పండగను క్రిస్టియన్‌లు ఆనందంగా జరుపుకున్నారు. చర్చిల వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో కుటుంబమంతా పాల్గొన్నారు. కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. పా త మల్లాయపాలెంలో చిన్నారులతో కలిసి కేక్‌ కట్‌ చేశారు. వ ల్లాపల్లి, కొణిదెన, చెన్నుపల్లి, ఉప్పుమాగులూరు, గుంటుపల్లి, అంబడిపూడి, కొమ్మినేనివారిపాలెం, కొప్పెరపాడు, వైదన, గంగపాలెం, గొర్రెపాడుచ కూకట్లపల్లి, వెలమవారిపాలెం, కొ త్తూరు, కొప్పెరపాలెం గ్రామా ల్లో చర్చిలను లైటింగ్‌, పూలతో అలంకరించారు.

పంగులూరు : గ్రామాల్లో విద్యుత్‌ లైటింగ్‌ స్టార్‌లు ఆకర్షణగా నిలిచాయి. పంగులూరు, ఇంకొల్లు ప్రధా న రహదారిలో ఆరికట్లవారిపాలెం వద్ద క్రిస్మస్‌ సంద ర్భంగా ఏర్పాటు చేసిన ప్రవేశ ద్వారం ప్రత్యేకతను సంతరించుకుంది. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చిన్నారులకు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.

పర్చూరు : క్రిస్మస్‌ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. చర్చిల్లో మంగళవారం అర్ధరాత్రి నుంచి ప్రత్యేక ప్రార్థనలతో క్రీస్తు జననానికి స్వాగతం పలికారు. లూథర్‌ చర్చిలో రెవరెండ్‌ జోసఫ్‌ కేరీ సువార్తను విన్పించారు. నాగులపాలెంతోపాటు అ న్ని చర్చిల్లో ప్రార్థనలు జరిగాయి. నాగులపాలెం లూథరన్‌ చర్చ్‌ ప్రాంగణంలో స్వామి, మేరీ రోజ్‌ దంపతులు 100 మంది నిరుపేద వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు.

మార్టూరు : క్రిస్మస్‌ పండుగను వేడుకగా నిర్వహించారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధ వారం తెల్లవారే వరకూ చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిం చి అందరూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు.

Updated Date - Dec 25 , 2024 | 10:32 PM