ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆంధ్రకేసరి వర్సిటీ ఖోఖో జట్టు ఎంపిక

ABN, Publish Date - Dec 23 , 2024 | 11:52 PM

ఆంధ్రకేసరి యూనివర్సిటీ పురుషుల ఖోఖో జట్టు ఎంపిక సోమవారం పంగులూరులో జరిగింది. ఈ ఎంపికకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని డిగ్రీ కళాశాలలు, బీపీఈడీ కళాశాలల నుంచి 50 మంది క్రీడాకారులు హాజరయ్యారు.

పంగులూరులో ఎంపిక చేసిన ఆంధ్రకేసరి యూనివర్శిటీ పురుషుల ఖోఖో జట్టు

పంగులూరు, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : ఆంధ్రకేసరి యూనివర్సిటీ పురుషుల ఖోఖో జట్టు ఎంపిక సోమవారం పంగులూరులో జరిగింది. ఈ ఎంపికకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని డిగ్రీ కళాశాలలు, బీపీఈడీ కళాశాలల నుంచి 50 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఇంకొల్లు డీసీఆర్‌ఎం డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఎస్‌ఆర్‌ఆర్‌ ఖోఖో అకాడమీ వారి సహకారంతో పంగులూరులో జరిగిన ఈ ఎంపికకు ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఫిజికల్‌ డైరక్టర్‌ డాక్టర్‌ ఐ.దేవీవరప్రసాద్‌ పరిశీలకులుగా వ్యవహరించగా, ఎంపిక కమిటీ సభ్యులు డాక్టర్‌ జి.సాయిసురేష్‌ డీసీఆర్‌ఎం డిగ్రీ కళాశాల కరస్పాండెంట్‌ చిలుకూరి శ్రీధర్‌, ఎస్‌ఆర్‌ఆర్‌ అకాడమీ డైరక్టర్‌, ఖోఖో అసోషియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి ఎం.సీతారామిరెడ్డి పర్యవేక్షణలో క్రీడా జట్టు ఎంపిక జరిగింది.

జట్టుకు ఎంపికయిన క్రీడాకారులు

ఆంధ్రకేసరి వర్సిటీ పురుషుల ఖోఖో జట్టుకు ఎంపికైన వారి వివరాలను డాక్టర్‌ జి.సాయిసురేష్‌ సోమవారం పంగులూరులో ప్రకటించారు. జీవీఎన్‌ శివ, షేక్‌ అహమ్మద్‌, ఎ.వీరాంజనేయులు, కె.రామ్మోహన్‌, యు.గణేష్‌ (వివేకానంద బీపీఈడీ కళాశాల పొదిలి), బి.లక్ష్మీనారాయణ (సిద్ధమూర్తి బీపీడీ, సింగరాయకొండ), పి.గోపి, ఎం.ప్రసాద్‌, వై.సుధీర్‌, కె.వెంకటేశ్వర్లు, ఎన్‌.షాలెంరాజు, జె.నవీన్‌, ఐ.ఏలియా, వి.సిద్ధుప్రసాద్‌, ఎం.మంత్రూనాయక్‌ (డీసీఆర్‌ఎం డిగ్రీ కళాశాల ఇంకొల్లు) ఎంపికయ్యారు. ఈ జట్టు ఈ నెల 27 నుంచి 31 వరకు తమిళనాడులోని తిరువుయూర్‌లో జరిగే సౌత్‌జోన్‌ ఇంటర్‌ యూనివర్సిటీ ఖోఖో పోటీలలో పాల్గొంటారని సాయిసురేష్‌ తెలిపారు. వర్సిటీ ఏర్పాటు చేసిన తరువాత తొలిసారిగా క్రీడా జట్టును పోటీలకు పంపుతున్న వైస్‌ చాన్సలర్‌ ప్రొఫ్‌సర్‌ డీవీఆర్‌ మూర్తి, రిజిస్ర్టార్‌ ప్రొఫెసర్‌ బి.హరిబాబులకు క్రీడాకారులు కృతజ్ఙతలు తెలిపారు.

Updated Date - Dec 23 , 2024 | 11:52 PM