ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇన్‌చార్జి సెక్టోరల్‌ సిబ్బంది నియామకం

ABN, Publish Date - Dec 24 , 2024 | 01:22 AM

సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు ఇన్‌చార్జి సెక్టోరల్‌ సిబ్బందిని నియమిస్తూ డీఈవో కిరణ్‌కుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. నలుగురు సభ్యుల కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించి వీరిని ఎంపిక చేసింది.

డీఈవో కిరణ్‌కుమార్‌ ఉత్తర్వులు

ఒంగోలు విద్య, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు ఇన్‌చార్జి సెక్టోరల్‌ సిబ్బందిని నియమిస్తూ డీఈవో కిరణ్‌కుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. నలుగురు సభ్యుల కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించి వీరిని ఎంపిక చేసింది. సీఎంవోగా సంతనూతలపాడు జడ్పీ హైస్కూలు హిందీ స్కూలు అసిస్టెంట్‌ కె.సోనీరూత్‌, ఎంఐఎస్‌అండ్‌ ప్లానింగ్‌ కోఆర్డినేటర్‌గా పచ్చవ జడ్పీ హైస్కూలు గణితం అసిస్టెంట్‌ ఎం.జాలరత్నం, ఏఎల్‌ఎస్‌ కోఆర్డినేటర్‌గా దేవరపాలెం హైస్కూలు గణితం అసిస్టెంట్‌ డి.నాగరాజు ఎంపికయ్యారు. జీసీడీవోగా చిమట ఎంపీయూపీ స్కూలు ఇంగ్లీషు అసిస్టెంట్‌ కె.హేమలత, ఐఈ కోఆర్డినేటర్‌గా వైపాలెం జీహెచ్‌ఎస్‌ గణితం అసిస్టెంట్‌ పి.నాగేంద్రనాయక్‌, ఏఎస్‌ఓగా కలుజువ్వలపాడు జడ్పీ హైస్కూలు పీఎస్‌ అసిస్టెంట్‌ బి.శ్రీనివాసరావులు ఎంపికయ్యారు. సమగ్రశిక్ష జిల్లా ప్రాజెక్టులో ఇన్‌చార్జిలుగా పనిచేసేందుకు వీరిని వారు పనిచేస్తున్న పాఠశాలల నుంచి రిలీవ్‌ చేసి పంపాలని హెచ్‌ఎంలను డీఈవో ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు.

Updated Date - Dec 24 , 2024 | 01:22 AM