ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆటో బోల్తా.. నలుగురికి గాయాలు

ABN, Publish Date - Dec 23 , 2024 | 01:45 AM

పోలీసులను చూసి సడన్‌ బ్రేక్‌ వేసిన మోటార్‌సైక్లిస్టు కింద పడగా, అతడిని తప్పించే ప్రయత్నంలో ఆటో బో ల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న నలుగురు ప్రయాణికులు గాయ పడ్డారు.

ముందు వెళుతున్న మోటార్‌సైక్లిస్టు బ్రేక్‌ వేయడంతో ఘటన

ఒంగోలు(కైం), డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): పోలీసులను చూసి సడన్‌ బ్రేక్‌ వేసిన మోటార్‌సైక్లిస్టు కింద పడగా, అతడిని తప్పించే ప్రయత్నంలో ఆటో బో ల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న నలుగురు ప్రయాణికులు గాయ పడ్డారు. ఈ సంఘటన ఒంగోలులోని పాత జాతీయ రహదారిపై గల బులెట్‌ షోరూం సమీపంలో ఆదివారం సాయత్రం జరిగింది. వివరాలలోకి వెళితే.. మో టార్‌సైకిల్‌పై ఓ యువకుడు మంగమూరు రోడ్డు జంక్షన్‌ నుంచి దక్షణం వైపు వేగంగా వెళుతున్నాడు. అయితే బుల్లెట్‌ షోరూం సమీపంలో అధిక సంఖ్యలో ఉ న్న ట్రాఫిక్‌ పోలీసులను చూసి ఒక్కసారిగా బ్రేక్‌ వేయడంతో అదుపు తప్పి కిం ద పడ్డాడు. ఈక్రమంలో మోటార్‌సైకిల్‌ వెనుక వస్తున్న ఆటో డ్రైవర్‌ కింద ప డిన యువకుడిని తప్పించేందుకు సడన్‌ బ్రేక్‌ వేశాడు. దీంతో ఆటో అదుపు త ప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఆ సమయంలో ఆటోలో ఏడుగురు ప్రయాణికులు ఉండగా నలుగురుకి గాయాలు అయ్యాయి. క్షతగాత్రుల్లో ఇంజినీరింగ్‌ రెండో సం వత్సరం చదువుతున్న పెరిది సురేష్‌, యరజర్లకు చెందిన షేక్‌ మస్తాన్‌, వెంగ ముక్కపాలెంనకు చెందిన దాసరి ఆదిలక్ష్మి, ఒడిశాకు చెందిన మదన్‌ ఉన్నారు. వెంటనే అక్కడ ఉన్న ట్రాఫిక్‌ పోలీసులు ఓ వాహనంలో రిమ్స్‌కు తరలించారు.

Updated Date - Dec 23 , 2024 | 01:45 AM