ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నీటి సంఘాలకు సమస్యల సవాల్‌

ABN, Publish Date - Dec 23 , 2024 | 11:45 PM

ప్రస్తుతం కేడబ్ల్యుడీ(కృష్ణా వెస్ట్రన్‌ డెల్టా) పరిధిలోని ఆయకట్టులో సాగుదారులు పరిస్థితి సంకటంగా మారింది. సాగునీరు సక్రమంగా విడుద ల కాకపోవడం అందుకు కారణం. ఆయా సమస్యల పరిష్కారానికి సాగునీటి సంఘాల ప్రతినిధులు బాధ్యత వహించాల్సి ఉంది. తాజాగా ఎన్నికైన సాగునీటి సంఘాల బాధ్యులు తమ హక్కులతో పాటు బాధ్యతలను గుర్తెరిగి అడుగులు వేయాలని ఆయకట్టులోని రైతులు సూచిస్తున్నారు.

కాలువల్లో పెరిగిన గడ్డి

కాలువల్లో పెరిగిన గడ్డి

పొలాలకు సాగునీరు

సక్రమంగా వచ్చేలా

చర్యలు తీసుకోవడం తక్షణ విధి

ఆశాభావం వ్యక్తం చేస్తున్న రైతులు

చీరాల, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : ప్రస్తుతం కేడబ్ల్యుడీ(కృష్ణా వెస్ట్రన్‌ డెల్టా) పరిధిలోని ఆయకట్టులో సాగుదారులు పరిస్థితి సంకటంగా మారింది. సాగునీరు సక్రమంగా విడుద ల కాకపోవడం అందుకు కారణం. ఆయా సమస్యల పరిష్కారానికి సాగునీటి సంఘాల ప్రతినిధులు బాధ్యత వహించాల్సి ఉంది. తాజాగా ఎన్నికైన సాగునీటి సంఘాల బాధ్యులు తమ హక్కులతో పాటు బాధ్యతలను గుర్తెరిగి అడుగులు వేయాలని ఆయకట్టులోని రైతులు సూచిస్తున్నారు. లేదంటే సాగునీటి సంఘాల బాధ్యులతో తమకెలాంటి ప్రయోజనం ఉండదని చెప్తున్నారు. చీరాల, పర్చూరు నియోజకవర్గాల పరిఽధిలో సాగునీటి సంఘాల ప్రతినిధులకు క్షేత్ర స్థాయిలో సమస్యలు సవాల్‌గా మారుతున్నా యి. పలుచోట్ల కాలువల్లో పూడికతలు జరగలేదు. దీంతో పాటు పటుచోట్ల కాలువల్లో నాచు, తుంగ, గడ్డి ఏపుగా పెరిగి నీటి పారుదలకు ఆటంకం కలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా గా సాగునీటి సంఘాలకు జరిగిన ఎన్నికల క్రమంలో బాధ్యులు తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం కొమ్మమూరు ఆయకట్టు పరిధిలో మాగాణి సాగు జరుగుతోంది. ఆయకట్టు పరిధిలో అధికారికంగా, అనధికారికంగా సుమారు లక్ష ఎకరాల్లో మాగాణి సాగు జరుగుతోంది. కొమ్మమూరు కాలువ పరిధిలో సుమారు 70వేల నుంచి 80వేల ఎకరాలు సాగవుతోంది. మరో 20వేల ఎకరాలు ఆయకట్టు పరిధిలోని ఎత్తిపోతల పథకాల ద్వారా సాగవుతోం ది. అయితే ఆయకట్టు పరిధిలోని ఆ 20వేల ఎకరాలతో పాటు, దిగువ ప్రాంతంలోని మాగాణి సాగుకు అందాల్సిన సాగునీరు సక్రమంగా అందాలంటే కాలువలు సక్రమంగా ఉండాలి. నల్లమడ లాకుల నుంచి పెదగంజాం సీమౌత్‌ వరకు కాలువలో సాగునీరు సక్రమంగా పారుదల ఉన్నపుడే ఆయకట్టులోని భూములకు నీరు సక్రమంగా అందేది. అందుకు అనుగుణంగా సాగునీరు పారుదలకు కాలువలు సక్రమంగా లేవు.

ఇక ఆయకట్టు పరిధిలోని ఎత్తిపోతల పథకాల పరిఽధిలో సాగునీరు పారుదలకు సంబంధించిన కాలువలు అధ్వానంగా ఉన్నాయి. కొద్ది పాటి మరమ్మతులు నామ్‌కేవాస్తేగా జరిగాయి. అయితే సాగునీరు సక్రమంగా పారుదల జరిగే విధంగా చేపట్టాల్సిన చర్యలపై ప్రస్తుతం నీటి సంఘాల బాధ్యులుగా ఎన్నికైన వారిపై ఉంది. అందుకు అనుగుణంగా వారు అడుగులు వేయాలి. లేదంటే సాగునీటి సంఘాల ద్వారా తమకు ఒనగూరేదేమీ లేదని ఆయకట్టు రైతులు అంటున్నారు. ఈ నేపథ్యంలో రైతుల ప్రయోజనాలను కాపాడే దిశగా సాగునీటి సంఘాల భాధ్యులు తగిన అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.

Updated Date - Dec 23 , 2024 | 11:45 PM