ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మిర్చి పైరుకు తెగుళ్ల బెడద

ABN, Publish Date - Dec 23 , 2024 | 12:16 AM

: వాతావరణంలో ఏర్పడిన మార్పులతో పంట లను తెగుళ్ల బెడద వెంటాడుతోంది. ఎన్ని పురుగుమందులు వినియోగించినా తెగుళ్లు నివారణ కావడం లేదు.

పెద్దదోర్నాల, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): వాతావరణంలో ఏర్పడిన మార్పులతో పంట లను తెగుళ్ల బెడద వెంటాడుతోంది. ఎన్ని పురుగుమందులు వినియోగించినా తెగుళ్లు నివారణ కావడం లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నెల రోజులుగా తరచూ మంగు వాతావరణం ఉండడంతో పైర్లకు తెగుళ్లు ఆశిస్తున్నాయి. దీంతో పంట లను కాపాడుకునేందుకు కర్షకులు నానా అగ చాట్లు పడుతు న్నారు. విపరీతంగా పురుగు మందులు వినియోగిస్తూ పిచికారి చేస్తూ అఽధిక భారాన్ని మోస్తు న్నారు. అయినా తెగుళ్లు అదుపు లోకి రాలేదని రైతులు వాపోతు న్నారు. చివరికి వర్షాదారంగా సాగు చేసే మినుము, పప్పు శనగ, జొన్న, ఆముదం పంటలకు కూడా రెండు మూడు సార్లు మందులు వినియోగించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు.

మిరపను నలిపేస్తున్న నల్లి

మండలంలో ప్రధానంగా మిరపను అధిక విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు. సాగుచేసిన మిరప పైరును నల్ల నల్లిఆశించి నలిపేస్తోందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఆరుగాలం కష్టించి పంట దశకు తెచ్చుకున్న మిరపకు నల్లి సోకడంతో ఆకులన్నీ ముడుచుకు పోయి చివర్లు ఎర్రగా మారి పూత, పిందె నేల రాలుతోంది. చెట్లు పచ్చదనం, నునుపును కోల్పోయి నిర్జీవంగా తయారవడంతో ఏమి చేయాలో పాలుపోక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో రైతుల వద్దకు కొత్త కొత్త కంపెనీలు ప్రతినిధులు వచ్చి వారి మందులను అంటగడుతున్నారు. దీంతో వేలకు వేలు అదనంగా ఖర్చు చేస్తూ రైతులు అప్పల ఊబిలోకి కూరుకు పోతున్నారు.

Updated Date - Dec 23 , 2024 | 12:16 AM