క్రిస్మస్ జోష్
ABN, Publish Date - Dec 25 , 2024 | 01:26 AM
రక్షకుడు, దయామయుడు ఏసు ప్రభువు జన్మదిన వేడుకలకు ప్రార్థనా మందిరాలు ముస్తాబయ్యాయి. సరికొత్త శోభను సంతరించుకున్నాయి. గ్రామాల నుంచి పట్టణాల వరకు అంతటా సందడి నెలకొంది. పండుగ శుభాకాంక్షలు తెలియజేసే ఫ్లెక్సీలు, స్టార్స్, క్రిస్మస్ ట్రీలు పెద్దఎత్తున ఏర్పాటు చేశారు.
విద్యుత్ దీపాల అలంకరణతో మెరిసిపోతున్న చర్చిలు
అర్ధరాత్రి నుంచే ప్రారంభమైన ప్రత్యేక ప్రార్థనలు
మార్మోగిన ఏసు నామస్మరణ
ఒంగోలు, కార్పొరేషన్, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): రక్షకుడు, దయామయుడు ఏసు ప్రభువు జన్మదిన వేడుకలకు ప్రార్థనా మందిరాలు ముస్తాబయ్యాయి. సరికొత్త శోభను సంతరించుకున్నాయి. గ్రామాల నుంచి పట్టణాల వరకు అంతటా సందడి నెలకొంది. పండుగ శుభాకాంక్షలు తెలియజేసే ఫ్లెక్సీలు, స్టార్స్, క్రిస్మస్ ట్రీలు పెద్దఎత్తున ఏర్పాటు చేశారు. ఏసుక్రీస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ యువత రాత్రివేళ ఇళ్లను సందర్శించి క్యాండిల్స్ అందజేసింది. ఇక పిల్లలు, పెద్దలు, షాపింగ్‌లలో మునిగిపోయారు. దీంతో ఫుట్‌పాత్ వ్యాపారాలు ఊపందుకోగా, పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ కిక్కిరిసిపోతున్నాయి. పండుగ నేపథ్యంలో చరిత్ర కలిగిన చర్చిలకు రంగులు వేశారు. విద్యుత్ దీపాలతో అలంకరించారు. జిల్లాలోని ఒంగోలు జువెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి, మిషన్ కాంపౌండ్‌లోని క్లౌ మెమోరియల్, కనిగిరి దుర్గం బాప్టిస్ట్, మార్కాపురం తెలుగు బాప్టిస్ట్, పొదిలి సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలతోపాటు, ఆర్‌సీఎం చర్చిలు, పెంతెకోస్తు, ఎష్కోలు, క్రీస్తు సంఘం తదితరమందిరాల్లో మంగళవారం అర్ధరాత్రి నుంచి ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. క్రీస్తు పుట్టకను క్రైస్తవ పరిజనం ఘనంగా స్వాగతించింది. ఈ సందర్భంగా క్యాండిల్ లైట్స్ ప్రదర్శించారు. అంతటా ఏసు నామస్మరణ మార్మోగింది. సంఘ కాపరులు దైవ వాక్యాన్ని వినిపించారు.
Updated Date - Dec 25 , 2024 | 01:26 AM