ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

క్రీస్తు శాంతి సందేశం అనుసరణీయం

ABN, Publish Date - Dec 24 , 2024 | 11:02 PM

క్రీస్తు శాంతి సందేశం సర్వమానవాళికి అనుసరణీయమని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పేర్కొన్నారు. మండల పరిధిలోని ఈపురుపాలెం, తోటవారిపాలెం గ్రామాల్లో మంగళవారం స్థానికులు నిర్వహించిన సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో ఎమ్మెల్యే కొండయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రేమ, దయ, త్యాగాలకు ప్రతీకగా క్రీస్తు నిలిచారన్నారు.

క్రిస్మస్‌ ప్రార్థనలో పాల్గొన్న ఎమ్మెల్యే కొండయ్య

చీరాల, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : క్రీస్తు శాంతి సందేశం సర్వమానవాళికి అనుసరణీయమని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పేర్కొన్నారు. మండల పరిధిలోని ఈపురుపాలెం, తోటవారిపాలెం గ్రామాల్లో మంగళవారం స్థానికులు నిర్వహించిన సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో ఎమ్మెల్యే కొండయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రేమ, దయ, త్యాగాలకు ప్రతీకగా క్రీస్తు నిలిచారన్నారు. అనంతరం కేక్‌లను కట్‌ చేసి అందరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.

ప్రజలకు మంత్రి గొట్టిపాటి క్రిస్మస్‌ శుభాకాంక్షలు

అద్దంకి : మానవాళిని సన్మార్గం వైపు నడిపించేలా క్రీస్తు మార్గనిర్దేశం చేశారని విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా క్రైస్తవులకు విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మ్‌సను ఘరంగా జరుపుకుంటారన్నారు. నిస్సహాయులపై కరుణ, సాటి వారిపై ప్రేమ, క్షమ, సహనం దాతృత్వం, త్యాగం తన జీవితం ద్వారా మానవాళికి ఏసు ప్రభువు అందించిన మహోన్నత సందేశాలన్నారు. క్రిస్మ్‌సను క్రైస్తవులు కుటుంబసభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని మంత్రి రవికుమార్‌ ఆకాక్షించారు.

పర్చూరు : ప్రేమ, దయ, శాంతికి క్రీస్తు మార్గదర్శి అని ప్రభువు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుకోవాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అ న్నారు. మంగళవారం ఆయన ప్రజలందరికీ క్రిస్మస్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ అందరికీ శాంతి, సౌభాగ్యాలు నింపాలని, సీఎం చంద్రబాబుతోనే క్రిస్టియన్ల సంక్షేమం సాధ్యమన్నారు.

చీరాల : నియోజకవర్గ ప్రజలందరికీ మాజీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కరణం వెంకటేష్‌ మంగళవారం ప్రకటనలో క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సుఖ,సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

Updated Date - Dec 24 , 2024 | 11:02 PM