ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

క్లీన్‌ అండ్‌ గ్రీన్‌

ABN, Publish Date - Dec 22 , 2024 | 01:24 AM

జిల్లాలో పరిశుభ్రత, పచ్చదనం కార్యక్రమాలను శనివారం అధికార యంత్రాంగం నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో వలే మళ్లీ ‘క్లీన్‌ అండ్‌ గ్రీన్‌’ కార్యక్రమం చేపట్టాలని, ప్రతినెలా మూడో శనివారాన్ని అందుకు కేటాయించాలని ఇటీవల కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు.

ఒంగోలులోని ప్రకాశం భవన్‌లో పిచ్చి మొక్కలను తొలగిస్తున్న కలెక్టర్‌ అన్సారియా, జేసీ గోపాలకృష్ణ, అధికారులు (ఇన్‌సెట్‌లో) సూరారెడ్డిపాలెంలో పారిశుధ్య పనులను పరిశీలించి ప్రజలతో మాట్లాడుతున్న మంత్రి స్వామి

జిల్లావ్యాప్తంగా కార్యక్రమాలు ప్రారంభం

టంగుటూరు, సూరారెడ్డిపాలెంలో పాల్గొన్న కలెక్టర్‌.. పరిశీలించిన మంత్రి స్వామి

ప్రభుత్వ కార్యాలయాలు, విద్య, వైద్య సంస్థల్లో పరిశుభ్రతపై దృష్టి

ప్రతినెలా మూడో శనివారం నిర్వహణ

ప్రభుత్వ ఉత్తర్వుల కన్నా ముందే అన్సారియా చొరవ

ఒంగోలు, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పరిశుభ్రత, పచ్చదనం కార్యక్రమాలను శనివారం అధికార యంత్రాంగం నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో వలే మళ్లీ ‘క్లీన్‌ అండ్‌ గ్రీన్‌’ కార్యక్రమం చేపట్టాలని, ప్రతినెలా మూడో శనివారాన్ని అందుకు కేటాయించాలని ఇటీవల కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. అందుకు సంబంధించి త్వరలో ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు తెలిపారు. అయితే ముందుగానే జిల్లాలో ఈ కార్యక్రమం అమలుకు కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా చొరవ చూపారు. ఇప్పటికే కేంద్రప్రభుత్వ ఆదేశాలతో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం నడుస్తుండగా అన్నింటినీ కలిపి ‘పరిశుభ్ర ప్రకాశం-పచ్చదనం ప్రకాశం’ నినాదంతో ప్రతినెలా మూడో శనివారం కార్యక్రమాలు నిర్వహించాలని సంకల్పించారు. ఆమేరకు శుక్రవారం రాత్రి అధికారులందరితో కలెక్టర్‌ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి తగు సూచనల చేశారు. శనివారం ఉదయం జిల్లా అంతటా ఈ కార్యక్రమాలు చేపట్టారు. కలెక్టర్‌ అన్సారియా టంగుటూరులో లాంఛనంగా కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం అదే మండలంలోని సూరారెడ్డిపాలెంలోనూ పాల్గొన్నారు. అక్కడ ఈ కార్యక్రమాన్ని మంత్రి డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి పాల్గొని పరిశీలించారు. దళితవాడలో వీధులు, డ్రైన్లు పరిశుభ్రత పనులను పర్యవేక్షించారు. ప్రకాశం భవన్‌లో కలెక్టర్‌ అన్సారియా, జేసీ గోపాలకృష్ణ, డీఆర్వో ఓబులేషులు చీపురు పట్టి చిమ్మి పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. అంతకు ముందు జేసీ గోపాలకృష్ణ మద్దిపాడులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణాలు, విద్యాసంస్థలు, హాస్టళ్లు, వైద్యశాలలు తదితర ప్రాంతాలలో స్థానిక అధికారులు, సిబ్బంది పరిశుభ్రత కార్యక్రమాన్ని పాటించారు. ప్రతినెలా మూడో శనివారం ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్లు కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా తెలిపారు.

Updated Date - Dec 22 , 2024 | 01:24 AM