ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వర్షాలతో రైతుల్లో ఆందోళన

ABN, Publish Date - Dec 24 , 2024 | 10:54 PM

చేతికి వచ్చిన పంటలు వర్షార్పణం అవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. అద్దంకి, బల్లికురవ, సంతమాగులూరు మండలాలలో సాగర్‌ ఆయకట్టుతో పాటు బోరు బావుల కింద ముందుగా సాగు చేసిన వరి పంట కోత దశలో ఉంది. ఇప్పటికే కొంతమంది రైతులు వరి కోతలు కోయగా, మరి కొందరు వరి కోసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో తుఫాన్‌ ప్రభావంతో గాలులు వీస్తే వరి నేలవాలి రాలిపోతాయని ఆందోళన చెందుతున్నారు.

కలవకూరులో కోతకు వచ్చిన వరి

చేతికి వచ్చిన వరి, మొక్కజొన్న, జూట్‌

పంటలు నష్టపోతాయని దిగులు

అద్దంకి, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : చేతికి వచ్చిన పంటలు వర్షార్పణం అవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. అద్దంకి, బల్లికురవ, సంతమాగులూరు మండలాలలో సాగర్‌ ఆయకట్టుతో పాటు బోరు బావుల కింద ముందుగా సాగు చేసిన వరి పంట కోత దశలో ఉంది. ఇప్పటికే కొంతమంది రైతులు వరి కోతలు కోయగా, మరి కొందరు వరి కోసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో తుఫాన్‌ ప్రభావంతో గాలులు వీస్తే వరి నేలవాలి రాలిపోతాయని ఆందోళన చెందుతున్నారు. కొంత మంది రైతులు వరి సాగు లాభదాయకంగా ఉండటం లేదన్న ఉద్దేశ్యంతో సాగర్‌ ఆయకట్టులో సైతం మొక్కజొన్న సాగు చేశారు. మొక్కజొన్న కూడా కోత దశ కు చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పలు చోట్ల సాగు చేసిన జూట్‌ కూడా కోత దశలో ఉంది. ఇలా పంటలు ఇంటికి వచ్చే తరుణంలో వరుస తుఫాన్‌లతో వర్షాలు పడుతుండడంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు.

కోతలు వాయిదా వేసుకోవాలి

రైతులు వరి కోతలు వాయిదా వేసుకోవాలని అద్దంకి వ్యవసాయాధికారి కొర్రపాటి వెంకటకృష్ణ తెలిపారు. 26వ తేదీ వరకు తుఫాన్‌ ప్రభావం ఉన్నందున రెండురోజుల పాటు వాయిదా వేసుకోవాలన్నారు. పొలాలలో నీరు నిలువ కుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

- కొర్రపాటి వెంకటకృష్ణ, వ్యవసాయాధికారి, అద్దంకి

వానలతో అలజడి

బల్లికురవ : అల్పపీడన ప్రభావంతో మంగళవారం ఉదయం నుంచి వాతావరణలో మార్పులు వచ్చి వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బల్లికురవ మండలంలోని పలు గ్రామాలలో మొక్కజొన్న, జూట్‌, వరి పంటలు కోత దశలో ఉన్నాయి. రైతులు పంట నూర్పిళ్లు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. వారం రోజుల నుంచి వాతావరణంలో మార్పులు వచ్చి చెదురు మదురు వర్షాలు పడుతుండడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. మంగళవారం ఉదయం నుంచి పలు గ్రామాలలో ఎడతెరపి లేకుండా చిన్న పాటి వర్షం పడడంతో పంట నూర్పిడి చేస్తున్న రైతులు బెంబేలేత్తి పోతున్నారు. భారీ వర్షాలు పడితే పంట చేతికి రాదని వారు ఆందోళనలో ఉన్నారు. పలు గ్రామాలలో కొందరు రైతులు పంటలను నూర్పిడి చేసి కల్లాల్లో పంటలను ఉంచారు. వాటిని రక్షించుకునేందుకు పట్టలను కప్పి ఉంచారు. ఇప్పుడు వర్షాలు పడితే రైతులకు తీవ్ర నష్టాలు తప్పవు అని పలువురు రైతులు తెలిపారు.

పంటలను పరిశీలించిన అధికారులు

చీరాలటౌన్‌ : అల్పపీడనంతో రెండు రోజులుగా చీరాల పరిధిలోని ఎడతెరిపి లేకుండా చిరుజల్లులు కురుస్తున్నాయి. ఈక్రమంలో వ్యవసాయాధికారులు కోతకు వచ్చిన వరి పంటను మరో నాలుగు రోజులపాటు వాయిదా వేసుకోవాలని సూచించారు. మంగళవారం బాపట్ల ఏరువాక కేంద్ర బృందం శాస్త్రవేత్తలు డా.మురళీధర్‌ నాయక్‌, జిల్లా వనరుల కేంద్రం అక్తర్‌ హుస్సేన్‌లతో కలిసి ఏవో సుమతి తోటవారిపాలెం, వాడరేవు, సాల్మన్‌ సెం టర్‌, దేవాంగపురి ప్రాంతాల్లోని వరి, మొక్కజొన్న పంటలను పరిశీలించారు. గురువారం వరకు వర్షపాతం నమోదయి ఉన్నట్లు చెప్పారు. దీంతోనే రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రక్షణ చర్యలపై జాగ్రత్తలు వివరించారు. కార్యక్రమంలో ఆయా ప్రాంతాల వీఏఏలు, రమ్య, బాత్‌షేబా, ప్రసన్న, రమేష్‌, పశు సవంవర్థక శాఖ సిబ్బంది సాయి కుమార్‌, అశ్విని, రమేష్‌, రైతులు పాల్గొన్నారు.

అన్నదాతల్లో ముసురు గుబులు

పర్చూరు : ముసురు అన్నదాతల గుండెల్లో గుబులు రేపుతోంది. మరో ప్రక్క భారీ వానల హెచ్చరికల నేపథ్యంలో రైతులు బెంబేలెత్తుతున్నారు. మంగళవారం వేకువ జామునుంచే చిరుజల్లులు కురుస్తుండడంతో రైతులు ఆందోలన చెందుతున్నారు. భారీ వర్షం కురిస్తే వేల ఎకరాల్లో సాగుచేసుకున్న వైట్‌బర్లీ పరిస్థితి ఇబ్బంది కరంగా మారనుంది. భారీ వర్షం కురిస్తే వైట్‌ బర్లీ ఆకులపై ఉన్న మడ్డికారిపోయి నాణ్యత దెబ్బతింటుందని సాగుదారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వైట్‌బర్లీ ఆకుకొట్టే పనులు సాగుతున్నాయి. ఇలాంటి దశలో భారీ వర్షం కురిస్తే తీవ్రంగా నష్టపోవాల్సిన పరస్థితి ఉంది. పర్చూరు వ్యవసాయ సబ్‌ డివిజన్‌ పరిఽధిలోని పర్చూరు, కారంచేడు, యద్దనపూడి, ఇంకొల్లు మండలాల్లో వైట్‌ బర్లీ, మిర్చి, శనగ పంటలను రైతులు సాగు చేసుకోగా అందులో అగ్రభాగం రైతులు వైట్‌ బర్లీ పొగాకును సాగుచేశారు. దక్షిణ కోస్తా, ఆంరఽధా ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్తుండడంతో రైతులు పాలుపోని పరిస్థితిలో ఉన్నారు.

అధికంగా కురిస్తే నష్టమే

పంగులూరు : ఎడతెరపి లేకుండా పడుతున్న జల్లులు రైతును కలవర పెడుతున్నాయి. వానలు అధికంగా కురిస్తే పంటలకు నష్టమని అధికారులు చెప్తున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పొగాకు, మొక్కజొన్న, శనగ, వరి ఎంతో ఆశా జనకంగా ఉందని రైతులు ఆనందంతో ఉన్నారు. మండలంలోని పలు గ్రామాలలో సుమారు 4 వేల ఎకరాలలో సాగులో ఉన్న పొగాకు సగానికి పైగా ఆకు వలిచే దశలో ఉంది. 3 వేల ఎకరాలలో సాగవుతున్న శనగ మొలక దశ నుంచి 40 రోజుల పైరుగా ఉండగా, మొక్కజొన్న 3,650 ఎకరాలలో సాగు చేస్తున్నట్లు అధికారిక లెక్కలు. 11 వందల ఎకరాలలో వరి సాగులో ఉంది. కంకి ఏర్పడి గింజ పోసుకునే దశలో ఉందని వ్యవసాయాధికారి సుబ్బారెడ్డి తెలిపారు. చిరు జల్ల్షులతో నష్టం ఉండదని, ఒకవేళ రెండు సెంటీమీటర్లకు మించి పడితే నష్టం తప్పదని అధికారులు చెప్తున్నారు.

Updated Date - Dec 24 , 2024 | 10:54 PM