రెవెన్యూ సమస్యలు సరిచేసేందుకే సదస్సులు
ABN, Publish Date - Dec 24 , 2024 | 12:27 AM
గత వైసీపీ ప్రభుత్వంలో భూ రికార్డుల్లో జరిగిన తప్పులను పరిష్కరించేం దుకే కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందని ఎమ్మెల్యే కందుల నారాయ ణరెడ్డి అన్నారు.
మార్కాపురం రూరల్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి). గత వైసీపీ ప్రభుత్వంలో భూ రికార్డుల్లో జరిగిన తప్పులను పరిష్కరించేం దుకే కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందని ఎమ్మెల్యే కందుల నారాయ ణరెడ్డి అన్నారు. మండలంలోని గోగులదిన్నె గ్రామంలో సోమవారం తహసీల్దార్ కె చిరం జీవి ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నారా యణ రెడ్డి మాట్లాడుతూ, వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసినట్లుగా మాజీ సీఎం జగన్ ప్రారంభించి పశ్చిమ ప్రాంత ప్రజలను మోసం చేశారని అన్నారు. అందుకే గత ఎన్నికలలో వైసీపీకి ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారని అన్నారు. ప్రాజెక్టు పూర్తి కావాలంటే రెండు వేల కోట్ల రూపాయలు అవసరవుతాయని ఇప్పటి నుంచి ప్రతి రోజు 24 గంటలు కష్టపడినా రెండున్నరేళ్లు పడుతుందన్నారు. గత ప్రభుత్వం లో వైసీపీ నాయకులు గోగులదిన్నె గ్రామంలో ఎస్సీలకు శ్మశానవాటిక స్థలా న్ని కూడా కేటాయించకుండా మభ్యపెట్టారన్నారు. ఇప్పుడు కూట మి ప్రభుత్వంలో ఎస్సీలకు గ్రామం లో శ్మశాన వాటికస్థలాన్ని కెటాయి స్తామన్నారు. రెవెన్యూ సంబందిత అధికారులు అందరూ మీ గ్రామానికే వచ్చి సమస్యలు వివరంగా తెలుసు కుంటామన్నా రు. వీలైౖనంత వరకు అక్కడి క్కడే సమస్య లను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజలు రెవెన్యూ సదస్సు లకు సద్వినియోగం చేసుకుని భూ సమస్యలను పరిష్కరించు కోవాలని కోరారు. కార్యక్రమంలో డీటీ శ్రీని వాసులు, సర్వేయర్ సంజీవయ్య, ఎన్‌ఆర్‌ఈ జీఎస్ ఏపీవో జీవరత్నం, టీడీపీ నాయకులు జవ్వాజి రామాంజులరెడ్డి, కాకర్ల శ్రీనివాసులు, కాశిరెడ్డి, కృష్ణారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, రాజయ్య, వీఆర్‌వో, సచివాలయ, రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
Updated Date - Dec 24 , 2024 | 12:27 AM