ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కోర్సుకొండ నుంచి గ్రావెల్‌ను తరలించొద్దు!

ABN, Publish Date - Dec 19 , 2024 | 11:58 PM

తమ కు జీవనాధారంగా ఉన్న కోర్సుకొండ నుంచి గ్రావె ల్‌ను తరలించవద్దని కొర్రపాటివారిపాలెం గ్రామ స్థులు పేర్కొన్నారు. ఇందుకుసంబంధించి గ్రామ స్థులు, రైతుల అభిప్రాయాలను తెలుసుకునేందు కు ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న గ్రామానికి వ చ్చారు. ఈసందర్భంగా సమావేశమయ్యేందుకు యత్నించగా గ్రామస్థులు నిరాకరించారు.

కొండ ప్రాంతాన్ని పరిశీలించి గ్రామస్థులతో మాట్లాడుతున్న ఆర్డీవో, డీఎస్పీ

ఆర్డీవోకు స్పష్టం చేసిన కొర్రపాటివారిపాలెం గ్రామస్థులు

తాళ్లూరు, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): తమ కు జీవనాధారంగా ఉన్న కోర్సుకొండ నుంచి గ్రావె ల్‌ను తరలించవద్దని కొర్రపాటివారిపాలెం గ్రామ స్థులు పేర్కొన్నారు. ఇందుకుసంబంధించి గ్రామ స్థులు, రైతుల అభిప్రాయాలను తెలుసుకునేందు కు ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న గ్రామానికి వ చ్చారు. ఈసందర్భంగా సమావేశమయ్యేందుకు యత్నించగా గ్రామస్థులు నిరాకరించారు. తాను రోడ్డు నిర్మాణ కంటాక్టర్‌ తరుపున రాలేదని, జిల్లా కలెక్టర్‌ గ్రామానికి వెళ్లి ప్రజల, రైతుల అభిప్రాయాలను తెలుసునిరమ్మని చెప్పారని ఆమె పేర్కొన్నారు. తమ అభిప్రాయాలు చెబితే వాటిని జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తామన్నా రు. ఆర్డీవో విన్నపం మేరకు మాజీ సర్పంచ్‌ కోట నరసింహారావు గ్రామస్థుల అభిప్రాయలను తెలియజేశారు.

గ్రామ సమీపాన నున్న కోర్సుకొండ నాలుగు సామాజిక వర్గాలకు జీవనోపాధి కల్పిస్తున్నదన్నారు. ఇటీవల హైవే రోడ్డు నిర్మాణ సంస్థ వారు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా గ్రావెల్‌ తరలిస్తుండటంతో కొండ పూర్తిగా తగ్గి తమ భవిష్యత్తు తరాల వారికి ఇబ్బందులు వస్తాయన్నారు. దీంతో గ్రావెల్‌ తరలింపును అడ్డుకుంటు న్నామన్నారు. ఈ కొండ బాపట్ల జిల్లా అద్దంకి మండలం మోదేపల్లి ఇలాకాలో ఉందని చెప్పారు. తమ గ్రామానికి చెందిన పొలాలు రెండు జిల్లాల పరిధిలో ఉన్నాయ న్నారు. తమ గ్రామానికి చెందిన అద్దంకి పరిధిలోని కోర్సుకొండ నుండి అనుమతులు లేకుండా గ్రావెల్‌ తరలిస్తుండగా గ్రామస్థులు అడ్డుకుంటే తాళ్లూరు పోలీసులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జీవనాధారంకల్పిస్తున్న కోర్సు కొండ నుండి మట్టి తరలించేందుకు అనుమతించబోమన్నారు. గ్రామస్థుల చెప్పిన అభిప్రాయాలను రికార్డుచేయగా సంతకాలు పెట్టారు. అనంతరం ఆర్డీవో లక్ష్మీప్రసన్న, దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ కోర్సుకొండను సందర్శించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ కె.సంజీవరావు, డీటీ రాజు, సీఐ రామారావు, ఎస్సై మల్లికార్జునరావు, గ్రామపెద్దలు కె.రామయ్య, గొల్లపూడి వేణుబాబు, కె.శేషయ్య, సంగం ప్రభుదాసు, కె.అంజమ్మ తదితరులు పాల్గొ న్నారు.

కాగా, డీఎస్పీ లక్ష్మీనారాయణ టీడీపీ నేతలతో సంప్రదింపులు జరిపారు. జిల్లా ఎస్పీ ఆదేశానుసారం గ్రామానికి పోలీస్‌ సిబ్బంది రావటం జరిగిందన్నారు. గ్రామస్థుల అభి ప్రాయాలకు భిన్నంగా వ్యవహరించటం జరగదన్నారు. మట్టి తోలకం విషయమై టీడీపీ యువనేత గొల్లపూడి వేణుబాబు మాట్లాడుతూ గ్రామస్థుల అభిప్రాయం మేర కు ముందుకెళతామని డీఎస్పీకి స్పష్టం చేశారు. తాము సీఎం చంద్రబాబు పాలనకు, చేపడుతున్న అభివద్ధి పనులకు వ్యతిరేఖం కాదని చెప్పారు. కోర్సుకొండ తమ గ్రామంలోని అన్ని వర్గాలకు జీవనాధారంగా ఉందన్నారు. ఖచ్చితంగా కొండ నుంచి గ్రావెల్‌ తరలించాలను కుంటే ఎన్‌వోసీ, మైనింగ్‌ పర్మిషన్‌ తీసుకుని నిరభ్యంతరంగా తీసుకోవచ్చని చెప్పారు. అయితే, ఎలాంటి అను మతులు లేకుండా కొండను తవ్వితే గ్రామస్థులు ఒప్పు కోరని స్పష్టం చేశారు.

Updated Date - Dec 19 , 2024 | 11:58 PM