ఓటర్ల జాబితాను పరిశీలించిన ఎన్నికల పరిశీలకులు
ABN, Publish Date - Dec 24 , 2024 | 10:59 PM
ఎలక్షన్ పరిశీలకులు సూర్యకుమారి మంగళవారం చీరాలకు ఆకస్మికంగా వచ్చారు. ఈసందర్భంగా ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు ఆధ్వర్యంలో చీరాల మునిసిపల్ పరిధిలోని గంజిపాలెం సచివాలయంలో సమావేశం నిర్వహించారు.
చీరాలటౌన్, డిసెంబరు24 (ఆంధ్రజ్యోతి) : ఎలక్షన్ పరిశీలకులు సూర్యకుమారి మంగళవారం చీరాలకు ఆకస్మికంగా వచ్చారు. ఈసందర్భంగా ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు ఆధ్వర్యంలో చీరాల మునిసిపల్ పరిధిలోని గంజిపాలెం సచివాలయంలో సమావేశం నిర్వహించారు. మార్పులు, చేర్పులు, ఇటీవల నమోదైన తొలగింపులకు సంబంధించిన చీరాల నియోజకవర్గ ఒటర్ల జాబితాను పరిశీలించారు. వాటిపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే సంబంధిత రికార్డులను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ గోపీకృష్ణ, వేటపాలెం తహసీల్దార్ పార్వతి, మునిసిపల్ కమిషనర్ అబ్దుల్ రషీ ద్, ఐసీడీసీ ప్రతినిధి ఉమా, బీఎల్‌వోలు, ఆయా కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Dec 24 , 2024 | 10:59 PM