ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎట్టకేలకు కదిలారు

ABN, Publish Date - Dec 22 , 2024 | 01:22 AM

జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో ఐదేళ్ల వైసీపీ పాలనలో భారీగా అవి నీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. ఇందుకు సంబంధించి కలెక్టర్‌ అన్సారియా పంపిన నివేదిక ఆధారంగా సమగ్ర విచారణ చేపట్టాలని నిర్ణయించింది. సెక్షన్‌ 51 విచారణకు ఆదేశించింది.

ఒంగోలులోని పీడీసీసీ బ్యాంకు

డీసీసీబీపై సెక్షన్‌ 51 విచారణ

కలెక్టర్‌ పర్యవేక్షణలోనేచేయాలి

సహకారశాఖ ఉన్నతాధికారుల ఆదేశం

ఒంగోలు, డిసెంబరు 21 (ఆంధ్ర జ్యోతి): జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో ఐదేళ్ల వైసీపీ పాలనలో భారీగా అవి నీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. ఇందుకు సంబంధించి కలెక్టర్‌ అన్సారియా పంపిన నివేదిక ఆధారంగా సమగ్ర విచారణ చేపట్టాలని నిర్ణయించింది. సెక్షన్‌ 51 విచారణకు ఆదేశించింది. ఈ విషయంలో సహకారశాఖ ఉన్నతాధికారుల ఉదాసీనతపై ఈనెల 18న ఆంధ్రజ్యోతిలో ‘మీనమేషాలు’ శీర్షికన ప్రచురించిన కథనంతో ఉన్నత స్థాయిలో కదలిక వచ్చింది. సమగ్ర విచారణ చేపట్టాలంటూ సహకార శాఖ ఉన్నతాధికారులు కలెక్టర్‌ అన్సారియాకు లేఖ పంపారు. స్థానికంగా కలెక్టర్‌ పర్యవేక్షణలో ఒక అధికారిని నియమించి సెక్షన్‌ 51 విచారణ చేయించడం లేదా అవసరం అనుకుంటే రాష్ట్ర సహకార శాఖ నుంచి ఉన్నతాధికారిని నియమించడంపై నిర్ణయం తీసుకునే వెసులుబాటును కలెక్టర్‌కు కల్పించారు.

వైసీపీ హయాంలో అక్రమాలు

వైసీపీ పాలనలో ఎన్నికలు లేకుండా పర్సన్‌ ఇన్‌చార్జి కమిటీలతో ఐదేళ్ల కాలం వెల్లబుచ్చింది. అప్పుడు కమిటీగా ఉన్న అధికార వైసీపీ నాయకులు, అధికారులు కలిసి బ్యాంకులో భారీగా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారన్న ఫిర్యాదులను జిల్లాకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధులు కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈనేపథ్యంలో తొలుత విజిలెన్స్‌ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అనంతర పరిణామాలతో సహకార శాఖ ఉన్నతాధికారుల ఉదాసీన వైఖరిపై ‘ఆంధ్రజ్యోతి’ కథనాలతో విషయం సీఎం దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో కలెక్టర్‌కు ఉన్నతాధికారులు చేసిన సూచనలతో త్రిసభ్య కమిటీతో విచారణ చేయించారు. అందులో పలు అంశాలు వాస్తవమని తేలింది. ఆ మేరకు పక్షం క్రితం విచారణ కమిటీ నివేదికను ప్రభుత్వానికి కలెక్టర్‌ పంపించారు.


అయినా అనుమానాలే..

విచారణ కమిటీ నివేదికపై ఉన్నత స్థాయిలో స్పందన లేకపోవడంతో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు దీంతో ఉన్నతాధికారులలో కదలిక వచ్చింది. సెక్షన్‌ 51 విచారణకు అనుమతిస్తూ కలెక్టర్‌కు లేఖ పంపారు. అయితే ఇలాంటి విషయాలలో నిబద్ధత కలిగిన ఉన్నతస్థాయి అధికారిని ప్రభుత్వ స్థాయిలో విచారణాధికారిగా నియమించాలి. అందుకు భిన్నంగా నిత్యం బిజీగా ఉండే కలెక్టర్‌ను విచారణ చేయాలని, వీలు కాకపోతే రాష్ట్రస్థాయి కార్యాలయం అధికారి ఒకరి సేవలు వినియోగించుకోవాలని పేర్కొనడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Dec 22 , 2024 | 01:22 AM