ఒంగోలు అభివృద్ధిపై దృష్టి
ABN, Publish Date - Dec 25 , 2024 | 01:21 AM
ఒంగోలు నగరంలోని ప్రభుత్వ కార్యాలయ భవనాలపై ప్రజాప్రతినిధులు దృష్టి సారించారు. నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్స్ కార్పొరేషన్ (ఎన్‌బీసీసీ) అధికారులతో కలిసి మంగళవారం కలెక్టరేట్‌లో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్‌లు కలెక్టర్ తమీమ్ అన్సారియాతో భేటీ అయ్యారు.
కలెక్టర్‌తో ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే దామచర్ల భేటీ
ప్రభుత్వ భవనాలతోపాటు పలు అంశాలపై చర్చ
ఒంగోలు కలెక్టరేట్, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఒంగోలు నగరంలోని ప్రభుత్వ కార్యాలయ భవనాలపై ప్రజాప్రతినిధులు దృష్టి సారించారు. నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్స్ కార్పొరేషన్ (ఎన్‌బీసీసీ) అధికారులతో కలిసి మంగళవారం కలెక్టరేట్‌లో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్‌లు కలెక్టర్ తమీమ్ అన్సారియాతో భేటీ అయ్యారు. శిథిలావస్థలో ఉన్న ప్రకాశం భవనంతోపాటు పాత రిమ్స్, ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయంతోపాటు ఊరచెరువు అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఒంగోలు నగరంలో ఖాళీ స్థలాల పరిస్థితిని కమిషనర్ వెంకటేశ్వరరావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎన్‌బీసీసీ అధికారి రాజారాంకు వివరించారు. నగరంలో రీ డెవలప్‌మెంట్ కోసం తీసుకోవాల్సిన పలు అంశాలను ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌లు వివరించారు. అభివృద్ధికి సంబంధించి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ భవనాలతోపాటు కార్పొరేషన్‌లో ఖాళీగా ఉన్న స్థలాలను అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకుంటామని ఎన్‌బీసీసీ అఽధికారి రాజారాం తెలిపారు. అనంతరం వారు నగరంలోని ఖాళీస్థలాలను పరిశీలించారు.
Updated Date - Dec 25 , 2024 | 01:21 AM