ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

స్థలం ఉంటే ఇల్లు మంజూరు

ABN, Publish Date - Dec 29 , 2024 | 11:12 PM

పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) కింద స్థలం సిద్ధంగా ఉండి గృహాన్ని నిర్మించుకునేందుకు ఆసక్తి చూపించే పేదలందరికీ వెంటనే మంజూరు చేయనుంది.

యూనిట్‌ విలువ కూడా పెంపు

పీఎంఏవై కింద దరఖాస్తుల స్వీకరణ

మునిసిపాలిటీల్లో నెలాఖరు వరకే గడువు

ఒంగోలు నగరం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) కింద స్థలం సిద్ధంగా ఉండి గృహాన్ని నిర్మించుకునేందుకు ఆసక్తి చూపించే పేదలందరికీ వెంటనే మంజూరు చేయనుంది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణను చేపట్టింది. లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా యూనిట్‌ విలువను కూడా పెంచుతోంది. గత వైసీపీ ప్రభుత్వం ఒక్కో పక్కాగృహ నిర్మాణానికి రూ.1.50లక్షలను మంజూరు చేసింది. నిర్మాణ సామగ్రి ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో నిర్మాణాలు మా వల్ల కాదు బాబోయ్‌ అంటూ పేదలు గగ్గోలుపెట్టడంతో ప్రభుత్వం డ్వాక్రా సంఘాల మహిళల పేరుతో బ్యాంకుల్లో రూ.30వేల అప్పును ఇప్పించింది. అది కూడా అందరికీ మంజూరు కాలేదు. దీంతో ప్రభుత్వం ఇచ్చే రూ.1.50లక్షలతో ఇంటి బేసుమట్టం మాత్రమే వేసుకుని నిర్మాణాలను నిలిపేసిన లబ్ధిదారులు జిల్లాలో అనేక మంది ఉన్నారు. దీంతో యూనిట్‌ విలువను పెంచాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.


సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ

రాష్ట్రప్రభుత్వం కొత్తగా మంజూరు చేయబోయే గృహాలకు యూనిట్‌ విలువ రూ.2.50లక్షలకు పైగానే ఉంటుందని గృహనిర్మాణశాఖ అధికారులు అంటున్నారు. ఆమేరకు ప్రభుత్వం నుంచి వారికి సమాచారం అందినట్లు తెలుస్తోంది. పక్కాగృహాల మంజూరు కోసం ప్రభుత్వం ఇప్పటికే సచివాలయాల ద్వారా దరఖాస్తుల స్వీకరణను చేపట్టింది. మునిసిపాలిటీల్లో ఈనెలాఖరు వరకూ గడువు ఇచ్చింది. జిల్లాలోని ఒంగోలు కార్పొరేషన్‌, ఆరు మునిసిపాలిటీలకు ప్రభుత్వం 1,700 పక్కాగృహాలను మంజూరు చేసింది. వీటిలో ఒంగోలుకు 850, మార్కాపురానికి 240, కనిగిరికి రూ.150, పొదిలికి 130, గిద్దలూరుకు 120, దర్శికి 110, చీమకుర్తికి 100 కేటాయించింది. ఇప్పటివరకు అన్ని మునిసిపాలిటీల్లోని సచివాలయాల ద్వారా 916 దరఖాస్తులు అందాయి. గ్రామీణప్రాంతాల నుంచి పక్కాగృహాల కోసం ఇప్పటివరకు ఆయా సచివాలయాల ద్వారా 7,709మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరి సంఖ్య ఇంకా రెట్టింపు కానుంది. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి మరో నెలరోజులు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగనుంది. ఆ తర్వాత డిమాండ్‌ ప్రకారం ప్రభుత్వం గృహాలను మంజూరు చేయనుంది.

Updated Date - Dec 29 , 2024 | 11:12 PM