బాధ్యతగా పనిచేయకపోతే చర్యలు తప్పవు!
ABN, Publish Date - Dec 29 , 2024 | 11:48 PM
పట్టణంలోని ఎస్సీ 2 హాస్టల్ వార్డెన్ తీరుపై ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనర సింహారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతగా పనిచే యకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్థా నిక ఎస్సీ, బీసీ హాస్టల్స్‌ను ఆదివారం ఎమ్మెల్యే ఆకస్మి కంగా తనిఖీ చేశారు. హాస్టల్ పరిసరాలను పరిశీలించా రు. అపరిశుభ్రంగా ఉండటంపై అసహనం వ్యక్తం చేశా రు.
వార్డెన్‌పై ఎమ్మెల్యే డాక్టర్
ఉగ్రనరసింహారెడ్డి ఆగ్రహం
హాస్టల్‌లో అపరిశుభ్రతపై అసహనం
కనిగిరి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఎస్సీ 2 హాస్టల్ వార్డెన్ తీరుపై ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనర సింహారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతగా పనిచే యకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్థా నిక ఎస్సీ, బీసీ హాస్టల్స్‌ను ఆదివారం ఎమ్మెల్యే ఆకస్మి కంగా తనిఖీ చేశారు. హాస్టల్ పరిసరాలను పరిశీలించా రు. అపరిశుభ్రంగా ఉండటంపై అసహనం వ్యక్తం చేశా రు. ఇది హాస్టల్ ప్రాంగణమేనా అంటూ వార్డెన్ నాయక్ ను ప్రశ్నించారు. హాస్టల్‌లో విద్యార్థులు లేకపోవటానికి గల కారణాలు అడిగారు. హాస్టల్ అపరిశుభ్రంగా ఉంటే స్వీపర్, పారిశుధ్య సిబ్బంది ఏం చేస్తున్నారని ఎమ్మెల్యే వార్డెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోకపో తే ఉన్నతాధికారుల ద్వారా చర్యలు తీసుకోవాల్సి వస్తుం దన్నారు.
ఏం పిల్లలూ ఎలా ఉన్నారు..
ఏం పిల్లలూ.. ఎలా ఉన్నారంటూ బీసీ హాస్టల్ విద్యార్థులను ఎమ్మెల్యే డాక్టర్ ఉ గ్రనరసింహారెడ్డి యోగక్షేమాలు విచారిం చారు. బీసీ హాస్టల్‌లోని టాయిలెట్స్‌ను ప రిశీలించారు. అపరిశుభ్రంగా ఉండటంపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హా స్టల్‌లో విద్యార్థులకు అందుతున్న భోజన సౌకర్యం, మెనూ, ప్రత్యేక తరగతులపై విచారించారు. వార్డెన్ తీరుపై విద్యార్థుల ను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెం ట టీడీపీ నాయకులు దొడ్దా వెంకటసు బ్బారెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, నారపరెడ్డి (యడవల్లి) శ్రీని వాసులురెడ్డి, సుబ్రమణ్యం, తదితరులు ఉన్నారు.
Updated Date - Dec 29 , 2024 | 11:48 PM