గ్రావెల్ అక్రమ తరలింపును అడ్డుకోవాలి
ABN, Publish Date - Dec 28 , 2024 | 11:25 PM
ముప్పవరం-బెంగుళూరు హైవేరోడ్డు నిర్మాణం కోసం వెలుగువారిపాలెం సమీపానగల సర్వేనంబర్ 489 కొండ నుంచి అక్రమంగా గ్రావెల్‌ను తరలిస్తున్నారని గ్రామ స్థులు పేర్కొన్నారు. గ్రావెల్‌ను అక్రమ తరలింపును అడ్డుకోవాలని కోరారు. ఈమేరకు శనివారం వెలుగు వారిపాలెంలో జరిగిన రెవెన్యూ సదస్సులో తహసీ ల్దార్ కె.సంజీవరావుకు వినతిపత్రం అందజేశారు.
తాళ్లూరు, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ముప్పవరం-బెంగుళూరు హైవేరోడ్డు నిర్మాణం కోసం వెలుగువారిపాలెం సమీపానగల సర్వేనంబర్ 489 కొండ నుంచి అక్రమంగా గ్రావెల్‌ను తరలిస్తున్నారని గ్రామ స్థులు పేర్కొన్నారు. గ్రావెల్‌ను అక్రమ తరలింపును అడ్డుకోవాలని కోరారు. ఈమేరకు శనివారం వెలుగు వారిపాలెంలో జరిగిన రెవెన్యూ సదస్సులో తహసీ ల్దార్ కె.సంజీవరావుకు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతోకాలంగా గ్రామంలో పశువుల, గొర్రెలు, మేకల పెంపకందార్లు కొండకు జీవాలను మేతకు తోలుకుని వెలుతుంటారన్నారు. రోడ్డు నిర్మాణసంస్థవారు ఇష్టానుసారం గ్రా వెల్‌ను అక్రమంగా తరలిస్తున్నందున కొండ నామరూపాల్లేకుండా పోతున్నదన్నారు. భవిష్యత్తులో జీవాల మేతకు ఇబ్బందిగా ఉంటుందని చెప్పారు. అక్రమంగా గ్రావెల్ తరలించ కుండా తగు చర్యలు చేపట్టాలని విన్నవిస్తూ వినతిపత్రం అందజేశారు. అదే కొండకు గ్రామంలో ఆరుగురు వ్యక్తులు అక్రమంగా పట్టాలు పొందేందుకు నకిలీ రికార్డులు సృష్టించారని వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. నకిలీ రికార్డులు సృష్టించేందుకు సహకరించిన తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగిపై చర్యలు తీసు కోవాలన్నారు. అక్రమంగా పట్టాలు పొందినవారిపై కేసులు నమోదు చేయాలని గ్రామస్థులు తహసీల్దార్‌కు లిఖి తపూర్వకంగా ఫిర్యాదు అందజేశారు. కాగా, రెవెన్యూ సమస్యలపై 13 అర్జీలు అందజేశారు. కార్యక్రమంలో వీఆర్‌వో శివారెడ్డి, శాగం కొండారెడ్డి, ఎం.బ్రహ్మారెడ్డి, సీహెచ్‌వీ నాగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 28 , 2024 | 11:25 PM