నూతన సంవత్సర క్యాలెండర్, డైరీల ఆవిష్కరణ
ABN, Publish Date - Dec 30 , 2024 | 12:25 AM
పట్టణంలోని టీడీపీ కార్యాల యం వద్ద ఆదివారం యాదవ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ క్యాలెండర్‌ను ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ఆవిష్కరించారు.
గిద్దలూరుటౌన్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని టీడీపీ కార్యాల యం వద్ద ఆదివారం యాదవ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ క్యాలెండర్‌ను ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇటీవల రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యా యునిగా అవార్డు పొందిన మొర్రి పిచ్చయ్యను శాలువతో సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాముల వెంకటసుబ్బయ్య, యాదవ సంఘం నాయకులు ఒ.వెంకటయ్య, బి.చంద్రశేఖర్‌యాదవ్, బి.వెంకటేశ్వర్లు, డి.శ్రీరా ములు, యాదవ్ ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు సి.హెచ్.రవికాంత్, పి.చక్రపాణి, కె.పోలయ్య పాల్గొన్నారు.
తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్‌ను ఎమ్మెల్యే ముత్తు ముల అశోక్‌రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భం గా సంఘం నాయకులు ఎమ్మెల్యే ను ఘనంగా సన్మానిం చారు. కార్యక్రమంలో తెలుగునాడు మా ర్కాపురం డివిజన్ అధ్యక్షులు రెహమాన్, గౌరవా ధ్యక్షులు బాలగురువులు, ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివా సులు, సహయ కార్యదర్శులు ప్రసాద్, రామకృష్ణ పాల్గొన్నారు.
ఆల్ ఇండియా షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం డైరీని ఎమ్మెల్యే ముత్తు ముల అశోక్‌రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. పట్టణంలోని శ్రీనారాయణ విద్యాసంస్థల ఆవ రణలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డైరీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం స్టేట్ వైస్ ప్రెసిడెంట్ యామా సంజయ్, జిల్లా అధ్యక్షులు ఎం.శ్రీని వాసులు, కౌన్సిలర్ లొక్కు రమేష్, చంద్రశేఖర్, టీడీపీ రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి గోన చెన్నకేశవులు, నాయ కులు డానియేలు, రజనీబాబు, దివాకర్, రాయలమ్మ, దేవదానం, మహర్షి, వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు.
టీఎన్‌యూఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ
మార్కాపురం : తెలుగునాడు ఉపాధ్యా య సంఘం నూతన సంవత్సర క్యాలెండర్‌ను శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ఆది వారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కా రానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తోంద న్నారు. కార్యక్రమంలో తెలుగునాడు ఉపాఽ ద్యాయ సంఘం డివిజన్ అధ్యక్షులు రెహ మాన్, గౌరవాధ్యక్షులు బాలగురువులు, ప్రధాన కార్యదర్శి మండ్ల శ్రీనివాసులు, సహ కార్యదర్శులు ప్రసాద్, రామకృష్ణ పాల్గొన్నారు.
Updated Date - Dec 30 , 2024 | 12:25 AM