ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కనిపించని కేడర్‌

ABN, Publish Date - Dec 28 , 2024 | 01:24 AM

తమ పాలనలో చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రస్తుత విపక్ష వైసీపీ చేస్తున్న ప్రయత్నాలకు ప్రజాస్పందన పెద్దగా కనిపించడం లేదు. అందుకు విద్యుత్‌ చార్జీల పెరుగుదలను నిరసిస్తూ శుక్రవారం నిర్వహించిన నిరసన కార్యక్రమాలు దర్పణం పట్టాయి.

విద్యుత్‌ అధికారులకు వినతిపత్రం ఇస్తున్న వై.పాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్‌, వైసీపీ నాయకులు

జనం, వినియోగదారుల నుంచీ స్పందన నిల్‌

నాయకులతో వైసీపీ విద్యుత్‌ ధర్నా

ఆమడదూరంలో అసమ్మతి నేతలు

ఈ పాపం వారిదే అన్న ఆరోపణపై స్పందన కరువు

దర్శి కన్నా ఎర్రగొండపాలెంలోనే అధికం

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

తమ పాలనలో చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రస్తుత విపక్ష వైసీపీ చేస్తున్న ప్రయత్నాలకు ప్రజాస్పందన పెద్దగా కనిపించడం లేదు. అందుకు విద్యుత్‌ చార్జీల పెరుగుదలను నిరసిస్తూ శుక్రవారం నిర్వహించిన నిరసన కార్యక్రమాలు దర్పణం పట్టాయి. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆపార్టీ నిర్వహించిన కార్యక్రమాల్లో నాయకులు మినహా విద్యుత్‌ వినియోగదారులు కానీ, సాధారణ ప్రజలు కానీ కనిపించలేదు. ఆ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్న దర్శి, గిద్దలూరు నియోజకవర్గాల కన్నా ఎర్రగొండపాలెంలో జరిగిన కార్యక్రమంలోనే నాయకులు అధికంగా కనిపించారు. ప్రస్తుతం పెరిగిన విద్యుత్‌ చార్జీలతో తమకు సంబంధం లేదని, గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందే ఈ నిర్ణయం తీసుకుందని సీఎం చంద్రబాబు, విద్యుత్‌ శాఖ మంత్రి రవికుమార్‌ నుంచి కిందిస్థాయి వరకు ఘోషిస్తున్న విషయం విదితమే. ఇటీవల ఈ విషయంపై ఆందోళనలు చేసిన వామపక్షాలు సైతం పరోక్షంగా జగన్‌ ప్రభుత్వమే విద్యుత్‌ చార్జీల పెరుగుదలకు కారణమని అంగీకరిస్తూ ఆ భారాన్ని కూటమి ప్రభుత్వం మోయాలంటూ డిమాండ్‌ చేశాయి. ఆయితే వైసీపీ మాత్రం ఈ పెరుగుదల పాపమంతా కూటమి ప్రభుత్వానిదేనంటూ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాలు జరిగినప్పటికీ అన్నిచోట్లా ఆపార్టీ నాయకులు మాత్రమే కనిపించారు. సాధారణ ప్రజలు కాదు కదా కనీసం ఆ పార్టీ కార్యకర్తలు కూడా లేరు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్‌రెడ్డి తాను ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న దర్శిలో పాల్గొన్నారు. ఆయనతోపాటు జడ్పీ చైర్‌పర్సన్‌ వెంకాయమ్మ ఉన్నారు. ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు, పార్లమెంట్‌ ఇన్‌చార్జి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి గిద్దలూరులో మాజీ ఎమ్మెల్యే నాగార్జునరెడ్డితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రెండుచోట్ల కన్నా ఎర్రగొండపాలెంలో ఆ పార్టీ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమలోనే ఆ పార్టీశ్రేణులు ఎక్కువగా పాల్గొనటం విశేషం. ఉమ్మడి జిల్లా మొత్తంలో వైపాలెంలో ఎక్కువమంది వైసీపీ నాయకులు పాల్గొన్నారు. కనిగిరిలో ఒక్కొక్కరికి రూ.300 చెల్లించి ఒక కాలనీ నుంచి 300 మందిని సమీకరించినటు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. గిద్దలూరులో ఎప్పటిలాగే అసంతృప్త నాయకులు గైర్హాజరయ్యారు. మార్కాపురంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు హనుమారెడ్డి, ఆయన సతీమణి అయిన తర్లుపాడు జడ్పీటీసీ సభ్యురాలు గైర్హాజరయ్యారు. కందుకూరులో నాలుగు మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులతోపాటు కిందిస్థాయిలోని ప్రజాప్రతినిధులు ఎవ్వరూ హాజరుకాలేదు. మాజీ మంత్రి మహీధర్‌రెడ్డికి పార్టీ నుంచి సమాచారం లేకపోవడంతో ఆయనతోపాటు ముఖ్యమైన పార్టీశ్రేణులు గైర్హాజరయ్యారు. పర్చూరులో అమెరికా నుంచి వచ్చి బాలాజీ నాయకత్వం వహించినా 40మందికిలోపే హాజరుకావటం విశేషం. మాజీ మంత్రులు సురేష్‌, నాగార్జునలు పాల్గొన్న కొండపి, సంతనూతలపాడు కార్యక్రమాలు తూతూమంత్రంగా జరిగాయి.

Updated Date - Dec 28 , 2024 | 01:24 AM