ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దివ్యాంగుల శాఖలో అక్రమాలు

ABN, Publish Date - Dec 29 , 2024 | 01:16 AM

దివ్యాంగుల సంక్షేమ శాఖలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. శాఖ ద్వారా భర్తీచేసిన నాల్గో తరగతి ఉద్యోగాల్లో పలు అవకతవకలు చోటుచేసుకు న్నాయని ఇటీవల దివ్యాంగులు కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియాకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆమె.. సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని డిప్యూటీ కలెక్టర్‌ లోకేశ్వరరావును ఆదేశించారు. దీంతో ఆయన రంగంలోకి దిగారు.

దివ్యాంగులను విచారిస్తున్న డిప్యూటీ కలెక్టర్‌ లోకేశ్వరరావు

ఉద్యోగాల నియామకాలతోపాటు రుణాల మంజూరులో అవకతవకలు

విచారణాధికారి ఎదుట ఏకరువు పెట్టిన దివ్యాంగులు

ఒంగోలు కలెక్టరేట్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): దివ్యాంగుల సంక్షేమ శాఖలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. శాఖ ద్వారా భర్తీచేసిన నాల్గో తరగతి ఉద్యోగాల్లో పలు అవకతవకలు చోటుచేసుకు న్నాయని ఇటీవల దివ్యాంగులు కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియాకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆమె.. సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని డిప్యూటీ కలెక్టర్‌ లోకేశ్వరరావును ఆదేశించారు. దీంతో ఆయన రంగంలోకి దిగారు. ఈనేపథ్యంలో దివ్యాంగుల నుంచి అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. ఉద్యోగ నియామకాలతోపాటు కేంద్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం ఇచ్చే రుణాల్లో కూడా అక్రమాలు చోటుచేసుకున్నాయని విచారణాధికారికి కొందరు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దివ్యాంగుల సంక్షేమం కోసం 90శాతం కేంద్రప్రభుత్వం సబ్సిడీ ఇస్తుండగా ఐదు శాతం రాష్ట్ర ప్రభుత్వం, మరో ఐదు శాతం లబ్ధిదారుడు వాటా చెల్లించాల్సి ఉంది. అయితే ఈ రుణాల మంజూరులో కూడా పలు అక్రమాలు చోటుచేసుకున్నాయని శనివారం జరిగిన విచారణలో పలువురు దివ్యాంగులు.. లోకేశ్వరరావు ఎదుట ఏకరువు పెట్టారు. గత వైసీపీ ప్రభుత్వ హయాం నుంచి ఆర్థిక చేయూతను ఇచ్చే పథకాల అమలులో కూడా తమకు అన్యాయం జరిగిందని వారు వాపోయినట్లు తెలిపింది. దీంతో విచారణాధికారి లోకేశ్వరరావు ఆయా అంశాలపై దృష్టిపెట్టి కొంత సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది.

Updated Date - Dec 29 , 2024 | 01:16 AM