కంభం ఏఎంసీ చైర్మన్ పదవిపై సర్వత్రా ఆసక్తి
ABN, Publish Date - Dec 29 , 2024 | 01:18 AM
కంభం ఏఎంసీ చైర్మన్ ఎన్నికపై ప్రస్తుతం కూటమి నేతల్లో సర్వత్ర ఆసక్తి నెలకొంది. నామినేటెడ్ పోస్టుల ఎంపికలో భాగంగా సంక్రాంతి పండుగ సమయానికి మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్ ఎన్నిక ఉంటుందని తెలిసింది.
కంభం, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): కంభం ఏఎంసీ చైర్మన్ ఎన్నికపై ప్రస్తుతం కూటమి నేతల్లో సర్వత్ర ఆసక్తి నెలకొంది. నామినేటెడ్ పోస్టుల ఎంపికలో భాగంగా సంక్రాంతి పండుగ సమయానికి మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్ ఎన్నిక ఉంటుందని తెలిసింది. అందులో భాగంగా కంభం వ్యవసాయ మార్కెట్ చైర్మన్‌గా ఎవరిని ఎన్నిక చేస్తారనే ఆసక్తి మూడు మండలాల్లో కూటమి నాయకులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కంభం వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో కంభం, బేస్తవారపేట, అర్థవీడు మండలాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఎన్నికైన ఐదుగురు చైర్మన్లు కంభం, అర్థవీడు మండలాలకు చెందిన వారే ఉన్నారు. దీంతో ఈ సారి ఎలా గైనా బేస్తవారపేట మండలానికి చెందిన వ్యక్తిని చైర్మన్‌గా చేస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. గత వైసీపీ ఐదేళ్ల పాలనలో వ్యవసాయ మార్కెట్ కమిటీల అభివృద్ధికి ఎటువంటి నిధులు మంజూరు చేయకపోవ డం, గత మూడు సంవత్సరాలుగా కంభం ఏఎంసీకి చైర్మన్ నియామకం లేకపోవడంపై తీవ్రవిమర్శలు వస్తున్నాయి. 2001-2002 వర కు అర్ధవీడు మండలానికి చెందిన టీడీపీ నాయకులు దండు వెంకటరెడ్డి, 2002-2007 వరకు అప్పటీ టీడీపీ ఎమ్మెల్యే చప్పిడి వెంగ య్యకుమారుడు చప్పిడి రవిశంకర్, 2007- 2010 వరకు అర్థవీడు మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బొగ్గు రామచంద్రరెడ్డి, 2015-2016 వరకు కంభం మండలం జంగంగుంట్లకు చెందిన నెమలిదిన్నె చెన్నారెడ్డి, 2020-2022వరకు కంభం మండలం తురిమెళ్ల కు చెందిన వైసీపీ నాయకుడు ఏలం వెంక టేశ్వర్లు మార్కెట్ కమిటీ చైర్మన్లుగా పని చేశారు. 2022 నుండి ఇప్పటివరకు చైర్మన్ ఎన్నిక నిర్వహించలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్లో బాగంగా మార్కెట్ చైర్మన్‌గా ఎవరిని ఎంపిక చేస్తారో అనే చర్చ జోరుగా సాగుతోంది.
Updated Date - Dec 29 , 2024 | 01:18 AM