ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nimmala: ప్రాజెక్టు పూర్తికాకుండానే జాతికి అంకితం.. జగన్‌పై నిమ్మల ఆగ్రహం

ABN, Publish Date - Oct 29 , 2024 | 04:35 PM

Andhrapradesh: వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకుండానే జగన్ జాతికి అంకితం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఐదేళ్ళ పాలనలో జగన్ మొద్దు నిద్ర పోయారని విమర్శించారు. ఐదేళ్ళలో రూ.170 కోట్లు మాత్రమే జగన్ వెలిగొండ ప్రాజెక్టుకు ఖర్చు చేశారని తెలిపారు.

Minister Nimmala Ramanaidu

ప్రకాశం, అక్టోబర్ 29: మాజీ సీఎం వైఎస్ జగన్‌పై మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రపంచంలోనే అబద్దాలకు కేరాఫ్ అడ్రస్ జగన్ అని.. అబద్దాలు చెప్పడానికే జగన్ పేటెంట్ తీసుకున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం దోర్నాల మండలం కొత్తూరు వద్ద నిర్మాణంలో ఉన్న వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్‌‌ను మంత్రులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ.. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకుండానే జగన్ జాతికి అంకితం చేశారన్నారు. వైసీపీ ఐదేళ్ళ పాలనలో జగన్ మొద్దు నిద్ర పోయారని విమర్శించారు. ఐదేళ్ళలో రూ.170 కోట్లు మాత్రమే జగన్ వెలిగొండ ప్రాజెక్టుకు ఖర్చు చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి కుర్చీ కోసం జగన్ ఏమైనా చేస్తాడని వెలిగొండ ద్వారా రుజువైందన్నారు. లక్షా 20 వేల క్యూబిక్ మీటర్ల మట్టి టన్నెల్ 1 లో ఉందని.. రెండో టన్నెల్‌లో బెంచింగ్ పనులు ఉన్నాయన్నారు. 11 కిలో మీటర్లు మాత్రమే లైనింగ్ పనులు చేశారని తెలిపారు.

Bandi Sanjay: కేసీఆర్‌ కుటుంబంపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు



24 గంటలు.. 365 రోజులు పని చేస్తే ఒకటిన్నర సంవత్సరం పడుతుందన్నారు. పనులు పూర్తి కాకుండా వెలిగొండ ప్రాజెక్టును జాతికి ఎలా అంకితం చేశారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షానికే ఫీడర్ ఛానల్‌కు గండ్లు పడ్డాయన్నారు. నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద రూ.880 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో నిర్వాసితులకు 7 కాలనీలు ఏర్పాటు చేశామన్నారు. సొంత తల్లి, చెల్లెలు, సొంత చిన్నాన్న చెల్లెల్ని జగన్ మోసం చేశారని.. చిన్నాన్నని గొడ్డలితో చంపిన జగన్‌కు ప్రకాశం జిల్లా ప్రజల్ని మోసం చేయడం పెద్ద విషయం కాదన్నారు. దోచుకోవడంపై పెట్టిన శ్రద్ధ జగన్ పరిపాలన మీద పెట్టలేదని దుయ్యబట్టారు. వెలిగొండ ప్రాజెక్టు పనులపై రూట్ మ్యాప్ తయారు చేసి నవంబర్ నెలలో పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. దోపిడి, లూటీ, ధన యజ్ఞంగా ఇరిగేషన్ ప్రాజెక్టులను జగన్ చేశారని మంత్రి ఆరోపించారు.


2014-19లో గ‌త టీడీపీ పాల‌న‌లో వెలిగొండ ప్రాజెక్టుకు రూ.1373 కోట్లు కేటాయించి.. రూ.1319 కోట్లు ఖర్చు చేశామన్నారు. గ‌త అయిదేళ్ళ జ‌గ‌న్ పాల‌న‌లో రూ.3518 కోట్ల బ‌డ్జెట్ కేటాయించి, కేవ‌లం రూ.170 కోట్లు మాత్రమే ఖ‌ర్చు పెట్టారన్నారు. జ‌గ‌న్ పాల‌న‌ వెలిగొండ ప్రాజెక్టుకు శాపంగా మారిందన్నారు. ట‌న్నెల్స్, ఫీడ‌ర్ కెనాల్, రిజర్వాయర్ ప‌నులు, నిర్వాసితులకు 880 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా... ఒక రూపాయి కూడా జగన్ ఇవ్వలేదన్నారు. ఎన్నికల ముందు వెలిగొండ జాతికి అంకితం అనడం.. జగన్ మార్క్ మోసం , దగా అంటూ వ్యాఖ్యలు చేశారు. నిర్వాసితులను హౌస్ అరెస్ట్ చేసి జగన్.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించారని తెలిపారు. రెండో ట‌న్నెల్ 12వ కిలో మీట‌ర్ దగ్గర మూడేళ్ళ క్రిత‌మే ట‌న్నెల్ బోరింగ్ మెషిన్ పాడైపోయి ఉంటే దానిని ఎందుకు బ‌య‌ట‌కు తీయ‌లేక‌పోయారని అడిగారు. ఏ ప్రాజెక్టుకు వెళ్ళినా జ‌గ‌న్ విధ్వంసమే క‌నిపిస్తోందన్నారు. రెండు ద‌శ‌ల్లో వెలిగొండ ప్రాజెక్టును వెనువెంటనే పూర్తి చేయాల‌ని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారని తెలిపారు. ఫేజ్-1లో హెడ్ వ‌ర్క్స్, రెండు ట‌న్నెల్స్ , ఫీడ‌ర్ ఛానెల్, రిజ‌ర్వాయ‌ర్, రెగ్యులేట‌ర్ వంటి నిలిచిన‌పోయిన ప‌నులు పూర్తి చేసి వ‌చ్చే సీజ‌న్ నాటికి 1.19 ల‌క్షల ఎక‌రాల‌కు నీళ్ళు అందించాల‌ని సీఎం చంద్రబాబు ఆదేశించారని వెల్లడించారు. ఆదేశించారు.


ఐదేళ్లు ఏం చేశారు: మంత్రి డోలా

వెలిగొండ పూర్తయితే నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. తాను అధికారంలోకి వస్తే ఏడాదిలోగా వెలిగొండ పూర్తి చేస్తానన్న జగన్ ఐదేళ్లపాటు ఏం చేశారని ప్రశ్నించారు. ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండా, పరిహారం ఇవ్వకుండా ప్రారంభోత్సవం చేసి జిల్లా ప్రజల్ని జగన్ మోసం చేశారని మండిపడ్డారు. 2014 - 19 లోనే మెజార్టీ పనులు పూర్తి చేశామన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయన్నారు. వెలిగొండ ప్రారంభించింది చంద్రబాబు నాయుడే అని.. పూర్తి చేసేది కూడా చంద్రబాబు నాయుడే అని స్పష్టం చేశారు. త్వరితగతిన వెలిగొండ పూర్తిచేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. ప్రకాశం జిల్లా అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.


వెలిగొండ వద్ద దారుణ పరిస్థితులు: మంత్రి గొట్టిపాటి

వెలిగొండ ప్రాజెక్టు చూసి ఆశ్చర్య పోయామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. వెలిగొండ ప్రాజెక్టును జగన్ జాతికి అంకితం చేస్తే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేశారని భావించామని.. కానీ ప్రాజెక్టు వద్ద దారుణమైన పరిస్థితులు ఉన్నాయన్నారు. జగన్ ప్రభుత్వంలో ప్రాజెక్టులు నాశనం అయ్యాయన్నారు. రాబోయే రోజుల్లో వెలిగొండ ప్రాజెక్టును చంద్రబాబు పూర్తి చేస్తారని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు.


కాగా.. నిర్మాణంలో ఉన్న వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్‌ను మంత్రి నిమ్మల రామానాయుడితో పాటు మంత్రులు బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, ఉగ్ర నరసింహారెడ్డి , ఎంఎం.కొండయ్య, బిఎన్.విజయ్ కుమార్, అశోక్ రెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు, నారాయణ రెడ్డి, ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు.


ఇవి కూడా చదవండి...

PV Sindhu: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు స్థల వివాదం

Tirumala: జగన్, షర్మిలపై మంత్రి అనగాని నిప్పులు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 29 , 2024 | 05:04 PM