చిట్టడవిలా ఎన్నెస్పీ కార్యాలయం
ABN, Publish Date - Dec 29 , 2024 | 11:53 PM
ఒకప్పుడు అద్దంకి పట్టణానికి చివరగా ఉన్న ఎన్‌ఎ్‌సపీ కార్యాల యం ప్రస్తుతం నడిబొడ్డుగా మారింది. అద్దంకి పట్ట ణం విస్తరించడంతో ఎన్నెస్పీ కార్యాలయం పట్ట ణం మధ్యగా ఉంది. సుమారు 6 దశాబ్దాల కిందట నిర్మించిన క్వార్టర్స్, కార్యాలయం గదులు రెండు దశాబ్దాలుగా శిథిలావస్థకు చేరాయి.
శిథిలావస్థలో క్వార్టర్స్, పాత కార్యాలయం
విషసర్పాలకు, మందుబాబులకు అడ్డా
పట్టించుకోని అధికారులు
అద్దంకి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : ఒకప్పుడు అద్దంకి పట్టణానికి చివరగా ఉన్న ఎన్‌ఎ్‌సపీ కార్యాల యం ప్రస్తుతం నడిబొడ్డుగా మారింది. అద్దంకి పట్ట ణం విస్తరించడంతో ఎన్నెస్పీ కార్యాలయం పట్ట ణం మధ్యగా ఉంది. సుమారు 6 దశాబ్దాల కిందట నిర్మించిన క్వార్టర్స్, కార్యాలయం గదులు రెండు దశాబ్దాలుగా శిథిలావస్థకు చేరాయి. ఒకప్పుడు కార్యాలయం, క్వార్టర్స్‌లో ఉండే అధికారులు, సిబ్బందితో కళకళలాడిన ఎన్‌ఎ్‌సపీ కార్యాలయం రెండు దశాబ్దాలుగా హవా తగ్గుతూ వచ్చింది.
ప్రస్తుతం చిట్టడవిని మించి చెట్లు ఏపుగా పెరిగాయి. విషసర్పాలకు, మందు బా బులకు అడ్డాగా మారింది. ఎన్నెస్పీ కార్యాలయం ఆవరణలోనే పలు ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయింపు జరిగింది. కోర్టు భవనాల సముదాయం, తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, ట్రెజరీ కార్యాలయం, వ్యవసాయశాఖ కార్యాలయం, బీసీ సం క్షేమ బాలికల వసతిగృహం, అన్న క్యాంటీన్, అంబేడ్కర్ భవన్, మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంక్‌లకు కొం త స్థలాలను కేటాయించారు. కొంత భాగంలో ఎన్నెస్పీ కార్యాలయం నూతన భవనం నిర్మాణం చేశారు. అధికారులు, సిబ్బందికి మాత్రం నూతనంగా ఎలాంటి క్వార్టర్స్ నిర్మాణం చేయలేదు. దీంతో సుమారు సగా నికిపైగా స్థలంలో చిట్టడవిని తలపించేలా చెట్లు పెరిగాయి. ఎన్నెస్పీ కార్యాలయం ఆవరణ చుట్టూ ఉన్న గృహాల యజమానులు కూడా కొంత మేర స్థలాలను ఆక్రమించినట్లు తెలుస్తుంది. కనీసం ఆవరణను శుభ్రం చేసే విధంగా కూడా అధికారులు చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తుంది.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఎన్‌ఎ్‌సపీ కార్యాలయ ఆవరణను శుభ్రపరిచేలా చర్యలు చేపట్టడంతో పాటు సర్వే చేసి హద్దులు నిర్ధారించి, పాత క్వార్ట్‌ర్స్, కార్యాలయం గదులను తొలగించాలని, కొత్తగా క్వార్ట్‌ర్స్ నిర్మాణానికి చర్య లు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
Updated Date - Dec 29 , 2024 | 11:53 PM