వర్షాలతో నేల వాలిన వరి పంట
ABN, Publish Date - Dec 25 , 2024 | 10:23 PM
గత రెండు రోజుల నుంచి అల్పపీడన ప్ర భావంతో కురుస్తున్న చెదురు మదురు వర్షాలతో కోత దశలో ఉన్న వరి పంట నేల కొరిగింది. ఇప్పుడు భారీ వర్షాలు పడితే పడి పోయిన పంటకు తీవ్ర నష్టం అని రైతులు ఆందోళన చెందుతున్నారు. బల్లికురవ మండలంలోని వల్లాపల్లి, కొమ్మినేనివారిపాలెం, వైదన, ఎస్‌ఎల్ గుడిపాడు, అంబడిపూడి, గుంటుపల్లి గ్రామాలలో రైతులు సాగు చేసిన వరి పంట కోత దశకు వచ్చిం ది.
ఆందోళనలో రైతులు
బల్లికురవ, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : గత రెండు రోజుల నుంచి అల్పపీడన ప్ర భావంతో కురుస్తున్న చెదురు మదురు వర్షాలతో కోత దశలో ఉన్న వరి పంట నేల కొరిగింది. ఇప్పుడు భారీ వర్షాలు పడితే పడి పోయిన పంటకు తీవ్ర నష్టం అని రైతులు ఆందోళన చెందుతున్నారు. బల్లికురవ మండలంలోని వల్లాపల్లి, కొమ్మినేనివారిపాలెం, వైదన, ఎస్‌ఎల్ గుడిపాడు, అంబడిపూడి, గుంటుపల్లి గ్రామాలలో రైతులు సాగు చేసిన వరి పంట కోత దశకు వచ్చిం ది. వర్షాలు లేకుంటే పంట నూర్పిడి చేసేందుకు రైతులు సన్నాహాలు చేస్తున్నారు. కొన్ని గ్రామాలలో వరి పంట మోను బరువు చి న్న పాటి వర్షానికే కింద పడిపోతుందని రైతులు తెలిపారు. కొందరు రైతులు వరి కో త కోయగా ఓదెలు పొలంలో ఉన్నాయని రైతులు తెలిపారు. మబ్బులతో వాతావరణంలో మార్పుతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఇదిలావుంటే చేతికి అందే పంట నేల పాలవుతుందని రైతులు తెలిపారు. కొందరు రైతులు వర్షాలు తగ్గితే వరి కోతల కోసేందుకు సిద్ధం అవుతున్నారు.
Updated Date - Dec 25 , 2024 | 10:23 PM