ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రైవేటు వ్యాపారాలు దండి

ABN, Publish Date - Dec 22 , 2024 | 11:31 PM

శింగరకొండలో ప్రైవేటు వ్యాపారుల జోరు పెరగడంతో ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం ఆదాయానికి గండి పడుతుంది. దాతల సహకారంతో నిర్మించిన షాపింగ్‌ కాంప్లెక్స్‌లో అద్దెలకు తీసుకునేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం వద్ద ప్రైవేటు వ్యాపారులు ఏడాదికేడాది పెరిగిపోతున్నారు.

దేవాలయం వద్ద రోడ్డుపై తోపుడు బండ్లు, వ్రైవేటు వ్యాపారుల దుకాణాలు

శింగరకొండ ఆదాయానికి గండి

పెరుగుతున్న ట్రాఫిక్‌ కష్టాలు

దేవస్థాన అధికారుల ఉదాసీనత

అద్దంకి, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : శింగరకొండలో ప్రైవేటు వ్యాపారుల జోరు పెరగడంతో ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం ఆదాయానికి గండి పడుతుంది. దాతల సహకారంతో నిర్మించిన షాపింగ్‌ కాంప్లెక్స్‌లో అద్దెలకు తీసుకునేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం వద్ద ప్రైవేటు వ్యాపారులు ఏడాదికేడాది పెరిగిపోతున్నారు. దేవస్థానానికి అద్దెలు చెల్లించి వ్యాపారులు డజను మంది అయితే రోడ్లపై తోపుడుబండ్లు, చిన్న దుకాణాలు పెట్టుకొని వ్యాపారాలు చేసే వారు సుమారు 30 మందికి పైగానే ఉన్నారు. దీంతో లక్షల రూపాయల అద్దెలు చెల్లించి దేవస్థానం షాపులలో వ్యాపారాలు చేసుకునేందుకు వ్యాపారులు వెనుకడుగు వేస్తున్నారు. దేవస్థానం అధికారులు మరింత ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో ప్రైవేటు వ్యాపారుల సంఖ్య మరింత పెరుగుతోం ది. ఎలాంటి అద్దెలను చెల్లించేది లేక పోవడంతో దేవస్థానంలో షాపుల కంటే పూజా సామగ్రి ధరలు ఒకింత తగ్గిం చి అమ్మకాలు చేస్తుండడంతో భక్తులు కూడా ప్రైవేటు వ్యాపారుల వద్దనే కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో దేవస్థానం షాపులలో దుకాణాలు నిర్వహించే వ్యాపారుల వ్యాపారం మరింత తగ్గి పరోక్షంగా దేవస్థానం ఆదాయానికి గండి పడుతుంది. దాతల సహకారంతో ఇటీవల నిర్మించిన దేవస్థానం షాపులు అద్దెకు తీసుకునేందుకు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో కొన్ని ఇంకా ఖాళీగా ఉన్నాయి. ప్రైవేటు వ్యాపారుల మధ్య పోటీతత్వంతో ఇటీవల ప్రైవేటు వ్యాపారుల మధ్య ఘర్షణలు కూడా జరిగాయి. ప్రధాన రోడ్డుకు ఇరువైపులా ఆక్రమించి తోపుడు బండ్లు పెట్టి వ్యాపారాలు నిర్వహిస్తుండడంతో ట్రాఫిక్‌ సమస్య కూడా ఏర్పడుతుంది. ఆర్టీసీ బస్సులు కూడా కొన్ని సమయాలలో నిలిచిపోతున్నాయి. ప్రధానంగా మంగళ, శని, ఆదివారం, ప్రత్యేక పండుగల రోజులలో రద్దీ మరింత ఎక్కువగా ఉండి భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేటు వ్యాపారులకు గ్రామస్థాయి నేతల అండదండలు ఉండడంతో దేవస్థానం అధికారులు కూడా తమకెందుకులే అన్న ధోరణితో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా దేవస్థానం అధికారులు స్పందించి ప్రైవేటు వ్యాపారాలు జరగకుండా చర్యలు తీసుకొని, దేవస్థానం ఆదాయం పెరిగే విధంగా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

ప్రైవేటు వ్యక్తులు వ్యాపారాలు నిర్వహించకుండా చర్యలు

శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం పరిసర ప్రాంతం లో ప్రైవేటు వ్యక్తులు వ్యాపారాలు చేయకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దేవస్థానం ఆదాయం తగ్గడంతో పాటు, భక్తులకు మరింత ఇబ్బందిగా మారింది. వ్యాపారాలు నిర్వహించేందుకు ఉత్సాహం ఉన్న వ్యక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న షాపులను టెండర్‌ ద్వారా కేటాయించడం జరుగుతుంది.

- తిమ్మానాయుడు, ఈవో, శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానం

Updated Date - Dec 22 , 2024 | 11:31 PM