ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రేపు ప్రాజెక్టుల కమిటీ ఎన్నికలు

ABN, Publish Date - Dec 20 , 2024 | 12:31 AM

సాగునీటి సంఘాల ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు కమిటీ ఎన్నికలు ఈనెల 21న జరగనున్నాయి. అందుకు అవసరమైన ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. రాష్ట్రంలో సాగునీటి రంగం మూడు విభాగాలుగా నడుస్తుంది.

రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో నిర్వహణ

జిల్లాలో మూడు మధ్యతరహా ప్రాజెక్టులు

సాగర్‌ ప్రాజెక్టు కమిటీలో భాగస్వామ్యం

నర్సరావుపేట కలెక్టరేట్‌లో పోలింగ్‌

ఒంగోలు, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): సాగునీటి సంఘాల ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు కమిటీ ఎన్నికలు ఈనెల 21న జరగనున్నాయి. అందుకు అవసరమైన ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. రాష్ట్రంలో సాగునీటి రంగం మూడు విభాగాలుగా నడుస్తుంది. చెరువుల పర్యవేక్షణ మైనర్‌ ఇరిగేషన్‌లో ఉండగా మధ్యతరహా నీటి వనరుల పర్యవేక్షణ మీడియం ఇరిగేషన్‌లోనూ, భారీ ప్రాజెక్టుల పర్యవేక్షణ మేజర్‌ ఇరిగేషన్‌ విభాగంలో ఉన్నాయి. మేజర్‌ ఇరిగేషన్‌లో మూడు స్థాయిల్లో సాగునీటి సంఘాలు ఉండగా మీడియంలో రెండు, మైనర్‌ విభాగంలో ఒక స్థాయిలో ఉన్నాయి. మూడు విభాగాల్లోనూ క్షేత్రస్థాయిలో డబ్ల్యూయూఏలు ఉండగా వాటికి ఈనెల 14న ఎన్నికలు నిర్వహించారు. జిల్లాలో 88 మేజర్‌, 14 మీడియం, 240 మైనర్‌ ఇరిగేషన్‌లో డబ్ల్యూయూఏలు ఉండగా అన్నింటికీ ఎన్నికలు ఎకగ్రీవమయ్యాయి. రెండవస్థాయిలో మేజర్‌ విభాగంలో సాగర్‌ ప్రాజెక్టు పరిధిలో డిస్ట్రిబ్యూటరీ కమిటీ(డీసీ)లు ఉండగా జిల్లాలోని 10 డీసీలకు ఈనెల 17న ఎన్నికలు జరగ్గా అన్నీ ఏకగ్రీవంగా జరిగాయి. ఇక చివరి అంకమైన ప్రాజెక్టు కమిటీ ఎన్నికలు ఈనెల 21న జరగనున్నాయి.

ఉన్నతాధికారుల నేతృత్వంలో..

జిల్లాలో మీడియం ఇరిగేషన్‌ విభాగంలో పీబీ అనకట్ట, మెపాడు రిజర్వాయర్‌, కంభం చెరువులు ఉండగా వాటికి ప్రాజెక్టు కమిటీలను ఎన్నుకోవాలి. ఆ పరిధిలో ఇప్పటికే ఎన్నికైన డబ్ల్యూయూఏల అధ్యక్షులు ఓటర్లుగా ఈ కమిటీల ఎన్నికలు జరుగుతాయి. పీబీ ఆనకట్ట కమిటీ ఎన్నిక ఒంగోలు ఆర్డీవో నేతృత్వంలో మూలగుంటపాడులోనూ, మోపాడు రిజర్వాయర్‌ కమిటీ ఎన్నిక కనిగిరి ఆర్డీవో పర్యవేక్షణలో మోపాడులోనూ, కంభం చెరువు ఎన్నిక మార్కాపురం సబ్‌ కలెక్టర్‌ నేతృత్వంలోని కంభంలోనూ 21న జరగనుంది. జిల్లాలో భారీ నీటి వనరుగా ఉన్న సాగర్‌ ప్రాజెక్టు కమిటీ ఎన్నిక ఈనెల 21వ తేదీన నర్సరావుపేటలోని పల్నాడు జిల్లా కలెక్టర్‌ పర్యవేక్షణలో జరుగుతుంది. సాగర్‌ కుడికాలువ పరిధిలో ప్రస్తుతం ఉన్న పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లా పరిధిలో ఉన్న 48 డీసీ అధ్యక్షులు ప్రాజెక్టు కమిటీని ఎన్నుకోవాలి. అందులో 17 డీసీలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. ఈ కమిటీ కోసం పల్నాడు జిల్లా నేతలు పోటీపడుతుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు సూచనలకు అనుగుణంగా ఎంపిక జరగనుంది.

Updated Date - Dec 20 , 2024 | 12:31 AM