ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

డ్వామాలో శీనారెడ్డి భారీ దోపిడీ

ABN, Publish Date - Dec 25 , 2024 | 01:29 AM

డ్వామా పీడీగా కె.శీనారెడ్డి పనిచేసిన కాలంలో పెద్దఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని, తద్వారా భారీగా ప్రజాధనాన్ని ఆయన దోపిడీ చేశారని పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్‌ ఈదర మోహన్‌ ఆరోపించారు. ఆమేరకు శీనారెడ్డిపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ నిర్వహిస్తున్న త్రిసభ్య కమిటీ ఎదుట పలు అంశాలపై వివరణ ఇచ్చారు.

ప్రధాన ఫిర్యాదుదారు ఈదర మోహన్‌ నుంచి వివరాలు తెలుసుకుంటున్న త్రిసభ్య కమిటీ

త్రిసభ్య కమిటీ ఎదుట ప్రధాన ఫిర్యాదుదారు ఈదర మోహన్‌

పలు ఆరోపణలపై అంశాల వారీ వివరణ

కొనసాగుతున్న విచారణ

సోషల్‌ ఆడిట్‌ పరిస్థితిపైనా దృష్టి

ఒంగోలు, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : డ్వామా పీడీగా కె.శీనారెడ్డి పనిచేసిన కాలంలో పెద్దఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని, తద్వారా భారీగా ప్రజాధనాన్ని ఆయన దోపిడీ చేశారని పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్‌ ఈదర మోహన్‌ ఆరోపించారు. ఆమేరకు శీనారెడ్డిపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ నిర్వహిస్తున్న త్రిసభ్య కమిటీ ఎదుట పలు అంశాలపై వివరణ ఇచ్చారు. డ్వామా పూర్వ పీడీ శీనారెడ్డి అక్రమాలపై విచారణ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో కలెక్టర్‌ అన్సారియా త్రిసభ్య కమిటీని నియమించిన విషయం విదితమే. డిప్యూటీ కలెక్టర్‌ లోకేశ్వరరావు, జిల్లా ఆడిట్‌ అధికారి నారాయణరెడ్డి, స్టెప్‌ సీఈవో శ్రీమన్నారాయణలతో కూడిన కమిటీ కొద్దిరోజులుగా డ్వామాలో విచారణ చేస్తోంది. మంగళవారం కూడా కొనసాగించింది. జిల్లాలో శీనారెడ్డి పీడీగా పనిచేసిన కాలంలో ఉపాధి హామీ పథకంలో చోటుచేసుకున్న అవకతవకలపై దృష్టి సారించింది. సామాజిక తనిఖీలు, మండలాల్లో జరిగిన ప్రజావేదికలు.. ఆ సందర్భంగా సోషల్‌ ఆడిట్‌ బృందాలు అవకతవకలు జరిగినట్లు గుర్తించిన మొత్తాలు, వాటిని ప్రజావేదికల్లో పీడీ హోదాలో పాల్గొన్న శీనారెడ్డి తగ్గించడం, అనంతరం ఆయా సిబ్బందిని వ్యక్తిగత విచారణ పేరుతో పిలిచి రికవరీలు లేకుండా చేయడం, తదితర అంశా లకు సంబంధించిన పైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు.

అందరికీ నోటీసులు

భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఫిర్యాదులు ఉన్న కనిగిరి, దోర్నాల, ముండ్లమూరు, కొండపి మండలాలకు సంబంధించిన ఫైళ్లపై విజిలెన్స్‌ అధికారి ఝాన్సీరాణి, ఆ విభాగంలో కీలకమైన ఉద్యోగి సురేష్‌లను త్రిసభ్య కమిటీలోని అధికారులు పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. తదనంతరం ఇతర విభాగాల వారీ ఫైళ్లను పరిశీలిస్తున్నారు. ఇదిలాఉండగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శీనారెడ్డిని వచ్చేనెల 2న విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చిన త్రిసభ్య కమిటీ ఆలోపు ఆయా పైళ్ల పరిశీలనతోపాటు ఫిర్యాదుచేసిన వ్యక్తులను కూడా విచారించాలని నిర్ణయించింది. తదనుగుణంగా ప్రధాన ఫిర్యాదుదారునిగా ఉన్న పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్‌ ఈదర మోహన్‌బాబును పిలిచి విచారించారు. ఆయన ప్రభుత్వ పెద్దలకు చేసిన ఫిర్యాదులలో కొన్నింటిపై వివరాలను అడిగారు. కాగా తాను పేర్కొన్న ఫిర్యాదులన్ని వాస్తవాలే అని సంబంధిత పైళ్ళను పరిశీలిస్తే స్పష్టంగా ఆ విషయం బయటపడుతుందని ఆ సందర్భంగా అధికారుల కమిటీకి మోహన్‌ చెప్పినట్లు సమాచారం.


కమిటీ దృష్టికి పలు అంశాలు

నాటి వైసీపీ ప్రభుత్వంలో కీలకమైన వారితో అంటకాగుతూ డ్వామాలో శీనారెడ్డి అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డాడని తద్వారా ప్రజధానాన్ని భారీగా దోపిడీ చేశాడని మోహన్‌ త్రిసభ్య కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. తాను చేసిన ఫిర్యాదుపై అంశాల వారీగా వివరణలు ఇచ్చారు. ఆయన అధికారుల సూచనల మేరకు రాతపూర్వకంగా కూడా స్టేట్‌మెంట్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. డ్వామా పీడీగా పనిచేసిన కాలంలో శీనారెడ్డి సంపాదించిన అవినీతి సొమ్ముతో కొనుగోలు చేసిన భూములు, భవనాలు ఇతరత్రా ఆస్తుల విషయంపై కూడా వారికి వివరాలు చెప్పినట్లు తెలిసింది. కాగా మరికొందరు ఫిర్యాదుదారులను కూడా పిలిచి విచారించాలన్న ఆలోచనలో త్రిసభ్య కమిటీ ఉన్నట్లు సమాచారం.

Updated Date - Dec 25 , 2024 | 01:29 AM