ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రీ-సర్వేతో భూ సమస్యలకు పరిష్కారం

ABN, Publish Date - Dec 28 , 2024 | 11:19 PM

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూ సర్వేతో గ్రామాలలో ఎన్నో దశాబ్దాల నుంచి ఉన్న భూ సమస్యలు పరిష్కారం అవుతాయని రైతులు దగ్గరుండి తమ భూములను సర్వే చేయించుకోవాలని చీరాల అర్డీవో చంద్రశేఖరనాయుడు పేర్కొన్నారు. శనివారం మండలంలోని గుంటుపల్లిలో టీ డీపీ కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చాక మెట్టమెదటి సారిగా చేపడుతున్న భూ సర్వేపై రైతులకు అవగాహన ర్యాలీ నిర్వహించారు.

గుంటుపల్లిలో రీసర్వే అవగాహన ర్యాలీలో పాల్గొన్న ఆర్డీవో చంద్రశేఖరనాయుడు

రైతులు అందుబాటులో ఉండి వినియోగించుకోవాలి

ఆర్డీవో చంద్రశేఖరనాయుడు

బల్లికురవ, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూ సర్వేతో గ్రామాలలో ఎన్నో దశాబ్దాల నుంచి ఉన్న భూ సమస్యలు పరిష్కారం అవుతాయని రైతులు దగ్గరుండి తమ భూములను సర్వే చేయించుకోవాలని చీరాల అర్డీవో చంద్రశేఖరనాయుడు పేర్కొన్నారు. శనివారం మండలంలోని గుంటుపల్లిలో టీ డీపీ కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చాక మెట్టమెదటి సారిగా చేపడుతున్న భూ సర్వేపై రైతులకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామంలో రైతులతో కలిసి అర్డీవో పర్యటించారు. అనంతరం అయన మాట్లాడుతూ గుంటుపల్లి రె వెన్యూలో రైతులకు పలు సమస్యలు అధికంగా ఉన్నాయని వాటి పరిష్కారానికి ఈ భూ సర్వే ఎంతో ఉపయెగ పడతుందన్నారు. రైతులందరు సర్వే టీంలు కొలతలు వేసే రోజు పొలాలకు వెళ్లి తమ వద్ద ఉన్న పట్టాదారు పాసు పుస్తకాలు, లింక్‌ డ్యాక్‌మెంట్లు, రిజిస్ట్రేషన్‌ స్లాంపులు అధికారులకు చూపించాలన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి భూ సర్వే లేక రైతుల భూములు రికార్డులో నమోదు కాక పోవడంతో రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారన్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరిత గతిన సర్వే పూర్తి చేయిస్తామన్నారు. కార్యక్రమంలో త హసీల్దార్‌ రవినాయక్‌, డిప్యూటీ తహసీల్దార్‌ రవికుమార్‌, సర్వే డీటీ ప్రహర్ష, మండల సర్వేయర్‌ కిషోర్‌కుమార్‌, టీడీపీ నేతలు మలినేని గోవిందరావు, దద్దాల అంజయ్య, వీఆర్వో రామక్రిష్ట్ర, మాదాల శివన్నారాయణ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2024 | 11:19 PM