ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉపాధ్యాయులే జాతి నిర్మాతలు

ABN, Publish Date - Dec 30 , 2024 | 12:29 AM

ఉపాధ్యాయులే జాతి నిర్మాత లని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పేర్కొ న్నారు.

మార్కాపురం వన్‌టౌన్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయులే జాతి నిర్మాత లని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పేర్కొ న్నారు. స్థానిక జెడ్పీ బాలికల ఉన్నత పాఠ శాలలో మార్కాపురం పట్టణ, మండల, తర్లు పాడు మండల యూటీఎఫ్‌ స్వర్ణోత్సవాలలో ఆదివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులు అన్ని రకాల వేధింపులకు గురయ్యారన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు వేతనాలు కూడా సక్రమంగా ఇవ్వలేదన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అభివృద్ధి పనులకు నిధులు కూడా లేకుండా చేసిందన్నారు. యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో గతం లో అనేక పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు ప్రభుత్వాన్ని గాడిలో పెట్టారన్నారు. త్వరలోనే ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి తన సొంతనిధులతో ప్రోత్సాహకాలను అందిస్తాన న్నారు. అనంతరం పలువురు ఉపాధ్యాయు లను సన్మానించారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు, సీనియర్‌ నాయకులు మీగడ వెంకటేశ్వరరెడ్డి, జిల్లా కార్యదర్శి శ్రీరాములు, పాపయ్య, చలమయ్య, కాశిరెడ్డి, జయరామిరెడ్డి, రాజేష్‌, కృష్ణమూర్తి, శ్రీనివాసరెడ్డి, చంద్రశేఖరయ్య, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2024 | 12:29 AM