విద్యుత్ భారం వైసీపీదే!
ABN, Publish Date - Dec 28 , 2024 | 11:28 PM
విద్యుత్తు చార్జీలు తగ్గించాలని వైసీపీ నాయకులు ఆందోళన చేయటం దొంగే దొంగ అని రాద్ధాంతం చేసినట్లుగా ఉందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ధ్యజమెత్తారు. శనివారం ఆమె నరసరావుపేటలో విలేకరులతో మాట్లాడారు. వైసీపీ పాలనలో 13 సార్లు విద్యుత్తు చార్జీలు పెంచి ప్రజలపై పెనుబారం మోపారని విమర్శించారు.
దర్శి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): విద్యుత్తు చార్జీలు తగ్గించాలని వైసీపీ నాయకులు ఆందోళన చేయటం దొంగే దొంగ అని రాద్ధాంతం చేసినట్లుగా ఉందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ధ్యజమెత్తారు. శనివారం ఆమె నరసరావుపేటలో విలేకరులతో మాట్లాడారు. వైసీపీ పాలనలో 13 సార్లు విద్యుత్తు చార్జీలు పెంచి ప్రజలపై పెనుబారం మోపారని విమర్శించారు. వైసీపీ పాలనలో పెంచిన చార్జీలను తగ్గించాలంటూ వైసీపీ పార్టీ నాయకులు ఆందోళన చేయటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, వైసీపీ నాయకులు ఇదే విధానం కొనసాగిస్తే రానున్న రోజుల్లో ప్రజలే వైసీపీ నాయకులకు తగిన గుణపాఠం చెబుతారన్నారు.
Updated Date - Dec 28 , 2024 | 11:28 PM