ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భూసమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం

ABN, Publish Date - Dec 28 , 2024 | 12:28 AM

భూసమస్యలు పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులే స్తోందని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు.

కొనకనమిట్ల, డిసెంబరు 27 : భూసమస్యలు పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులే స్తోందని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని మునగపాడు గ్రామంలో శుక్రవారం రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొని మాట్లా డారు. గత వైసీపీ పాలనలో భూదోపిడిపై సమగ్ర విచారణ చేయించి నిజమైన భూయజమానులకు న్యాయం చేసేందుకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తు న్నట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో దుర్మార్గాలకు అంతేలేకుండా పోయిందన్నారు. వాటిని సరిచేసేందుకు సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌లు ల్యాండ్‌ గ్యాబ్రింగ్‌ చట్టం తీసుకొచ్చారన్నారు. ఈ చట్టం ద్వారా పేదప్రజల భూములకు డోకా లేకుండా పోతుందన్నారు. భూదందాతో పాటు మద్యం, ఇసుక దోపిడీకి అంతే లేకుండా పోయిందన్నారు. గత ప్రభుత్వం విద్యుత్‌పైనే 1.27 వేల కోట్లు బకాయి పెట్టి రాష్ట్రప్రజలను దీవాల తీయించారని తెలిపారు. ఇప్పుడు ఏమి ఎరగనట్లు విద్యుత్‌ చార్జీలపై కపట నాటకాలాడు తున్నారన్నారు. తొమ్మిదిసార్లు విద్యుత్‌ చార్జీలు పెంచిన ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు. డిస్క్‌మ్‌లకు విద్యుత్‌ చార్జీలు పెంచాలనే జీవోను ఇచ్చారని అది ఇప్పుడు అమలు చేస్తుంటే కూటమి ప్రభుత్వంపై బురదజల్లుతోందన్నారు. విద్యుత్‌చార్జీలను వారిపాలన లోనే పెంచిఇప్పుడు నిరసన తెలపడం దొంగే దొంగన్నట్లుగా ఉందని ఎద్దేవ చేశారు. తహసీల్దార్‌ సురేష్‌ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులో వచ్చిన త్రి అర్జీని 45 రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. కనుక భూసమస్యలు ఉన్న ప్రతిఒక్కరూ అర్జీల రూపంలో తెలియజేయాలన్నారు. రెవెన్యూ సదస్సుకు మొత్తం 20 అర్జీలు రాగా వాటిలో ఒకటి పరిష్కరించామని తహసీల్దార్‌ సురేష్‌ తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌ఐ మాధవరెడ్డి, వీఆర్‌వోలు రమేష్‌, జానయ్య, దిలీప్‌, పలువురు వీఆర్‌వోలు, మండల ఇన్‌చార్జి సర్వేయర్‌ రాజశేఖర్‌, పలువురు రైౖతులు తదితరులు పాల్గొన్నారు.

కంభం : మండలంలో గతంలో జరిగిన భూరికార్డులను అవతవక లను సరిదిద్దేందుకే గ్రామాలలో నెల రోజులుగా రెవెన్యూ సదస్సు లు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్‌ కిరణ్‌ తెలిపారు. శుక్రవారం కందులాపురంలో జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. తహసీల్దార్‌ మాట్లాడుతూ రైతుల సమస్యలు వీలైనంత వరకు ఇక్కడే పరిష్కరిస్తామన్నారు. సదస్సు లను సద్వినియోగం చేసు కోవాల న్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐ సిద్ధయ్య, సర్పంచ్‌ రజని, అధికారులు పాల్గొన్నారు.

తర్లుపాడు : మండలంలో కారు మానుపల్లి, ఫత్తేపురంలో శుక్రవారం నిర్వహించిన రెవెన్యూ గ్రామ సభలు తూతూమంత్రంగా జరిగాయి. తహసీ ల్దార్‌ విజయ్‌భాస్కర్‌ ఉదయం 11.30 గంటలకు భూసమస్యలు పరిష్కరించ లేనంటూ రెవెన్యూ గ్రామసభ నుంచి అర్థాంతరంగా సెలవుపెట్టి వెళ్లిపో యారు. దీంతో కారుమానుపల్లిలో తూతూమంత్రంగా గ్రామ సభ నిర్విహించారు. సాయంత్రం ఫత్తేపురంలో ఉన్నతాధి కారులు లేకుండానే వీఆర్‌వో మల్లికార్జున గ్రామసభ నిర్వహించి ముగించారు. తహసీల్దార్‌ లేకుం డా గ్రామసభ ఎలా నిర్వహిస్తారంటూ రైతులు వీఆర్‌ వో, సర్వేయర్‌లపై వాగ్వాదం చేశారు. షెడ్యూల్‌ ప్రకారం గ్రామసభ నిర్వహించినట్లు సర్వేయర్‌ సురేష్‌ తెలిపారు.

ఎర్రగొండపాలెం రూరల్‌ : స్థానిక డా.బి.ఆర్‌ అంబేడ్కర్‌ ఆడిటోరియంలో తహసీల్దార్‌ ఏ బాలకిషోర్‌ ఆధ్వ్యర్యంలో శుక్రవారం రెవెన్యూ సదస్సు నిర్వహిం చారు. ఈ సదస్సులో భూ సమస్యలపై మొత్తం 16 ఆర్జీలు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఇంటి స్థలం కోసం 8, ముటేషన్‌ 1 పలు ఇతర సమస్యలపై 7 ఆర్జీలు వచ్చినట్లు వివరించారు. కార్యక్రమంలో వీఆర్‌వోలు చంద్రశేఖర్‌, దానం, ఎల్లయ్య, సర్వేయర్లు దిలీప్‌, వేమా రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2024 | 12:28 AM