ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చీరల పంపిణీలో వైసీపీ నేతల చేతివాటం

ABN, Publish Date - Dec 23 , 2024 | 01:43 AM

మాజీ ముఖ్యమంత్రి జగన్‌ పుట్టిన రోజు సంద ర్భంగా శనివారం టంగుటూరులో వైసీపీ ఆధ్వ ర్యాన చీరల పంపిణీ జరిగింది. అయితే వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు చేతివాటం ప్రదర్శించి న్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

విస్తుపోయిన మహిళలు

టంగుటూరు, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : మాజీ ముఖ్యమంత్రి జగన్‌ పుట్టిన రోజు సంద ర్భంగా శనివారం టంగుటూరులో వైసీపీ ఆధ్వ ర్యాన చీరల పంపిణీ జరిగింది. అయితే వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు చేతివాటం ప్రదర్శించి న్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా నియోజకవర్గంలోని ప్రతి మం డల కేంద్రంలో చీరల పంపిణీ జరిగింది. చీరలను పార్టీ అధిష్ఠానం మండల కేంద్రానికి చేర్చింది. టంగుటూరు మండలానికి 535 చీరలను కేటా యించింది. పార్టీ కార్యాలయంలో కేక్‌లు కటింగు చేసిన కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి ఆదిమూల పు సురేష్‌బాబు, ఒంగోలు పార్లమెంటు నియోజ కవర్గ ఇన్‌చార్జి చెవిరెడ్డి భాస్కరరెడ్డి అక్కడి నుం చి వెళ్లిపోతూ చీరలు పంపిణీ చేయాలని మండ ల వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులను ఆదేశించా రు. వెంటనే రంగంలోకి దిగిన టంగుటూరు మా జీ సర్పంచ్‌ పుట్టా వెంకట్రావు, ఎంపీటీసీ ప్ర భుదాస్‌ ఇతర పార్టీ క్యాడర్‌ను దగ్గర పెట్టుకొని చీరల పంపిణీ ప్రారంభించారు. ఒకవైపు చీరల పంపిణీ జరుగుతుండగా మరొక వైపు కట్టలు క ట్టలు చీరలు బయటకు తరలించడం కనిపించిం ది. బయటకు తరలిస్తున్న చీరలను గేటు వద్ద మహిళలు అడ్డుకున్నా ప్రయోజనం లేకుండా పో యింది. కేవలం 300 చీరలు పంపిణీ మాత్రమే జరిగిందని, మిగిలిన చీరలన్నీ నాయకులు బ యటకు పంపించారని అక్కడివారు విమర్శిస్తు న్నారు. పార్టీ కార్యాలయం వద్ద గంటల తరబడి పడిగాపులు కాసినా ప్రయోజనం లేనేలేదని చీ రల కోసం వెళ్లి ఉసూరుమంటూ వెనుతిరిగిన మ హిళలు విమర్శిస్తున్నారు. అయితే పార్టీ గ్రామీణ నాయకులు కొందరు వారి భార్యల పేరుచెప్పి రెం డేసి చీరలు తీసుకపోయిన్నట్లు చెబుతున్నారు.

Updated Date - Dec 23 , 2024 | 01:43 AM