ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రాజెక్టుల కమిటీలూ ఏకగ్రీవం

ABN, Publish Date - Dec 22 , 2024 | 01:19 AM

సాగునీటి సంఘాల ఎన్నికల్లో చివరి అంకమైన ప్రాజెక్టు కమిటీల ఎన్నికలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో మీడియం ఇరిగేషన్‌ పరిధిలో పీబీ ఆనకట్ట, కంభం చెరువు, మోపాడు రిజర్వాయర్‌లతోపాటు జిల్లా అంతర్భాగంగా ఉన్న సాగర్‌ ప్రాజెక్టు కమిటీలు ఉండగా అన్నీ ఏకగ్రీవమయ్యాయి.

మోపాడు ప్రాజెక్టు చైర్మన్‌ కొండయ్యను అభినందిస్తున్న టీడీపీ నాయకులు

మూడు మీడియం ఇరిగేషన్‌, సాగర్‌ పీసీ ఎన్నికలు ప్రశాంతం

ముగిసిన ప్రక్రియ

అన్నింటిలోనూ టీడీపీదే హవా

ఒంగోలు, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : సాగునీటి సంఘాల ఎన్నికల్లో చివరి అంకమైన ప్రాజెక్టు కమిటీల ఎన్నికలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో మీడియం ఇరిగేషన్‌ పరిధిలో పీబీ ఆనకట్ట, కంభం చెరువు, మోపాడు రిజర్వాయర్‌లతోపాటు జిల్లా అంతర్భాగంగా ఉన్న సాగర్‌ ప్రాజెక్టు కమిటీలు ఉండగా అన్నీ ఏకగ్రీవమయ్యాయి. కొండపి నియోజకవర్గంలోని పీబీ ఆనకట్ట కమిటీ ఎన్నిక సింగరాయకొండ మండలం మూలగుంటపాడులో ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న నేతృత్వంలో జరిగింది. టీడీపీ సీనియర్‌ నేత మందలపు గాంధీచౌదరి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. కంభం చెరువు కమిటీ ఎన్నిక అక్కడి ఎంపీడీవో ఆఫీసులో మార్కాపురం సబ్‌ కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌ నేతృత్వంలో నిర్వహించారు. పార్సా ఆదినారాయణ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. మోపాడు రిజర్వాయర్‌ కమిటీ ఎన్నిక మోపాడులో కనిగిరి ఆర్డీవో కేశవర్ధన్‌రెడ్డి నేతృత్వంలో నిర్వహించగా చుంచు కొండయ్య చైర్మన్‌గా ఎన్నికయ్యారు. తీవ్ర పోటీ, ఉత్కంఠ నెలకొన్న నాగార్జున సాగర్‌ కుడి కాలువ ప్రాజెక్టు కమిటీ ఎన్నిక కూడా టీడీపీ అధిష్ఠానం ఆదేశాలతో ఏకగ్రీవమైంది. మొత్తం 48 డీసీల అధ్యక్షులు ఈ కమిటీలో ఓటర్లుగా ఉన్నారు. అందులో మన జిల్లాలో 10 మంది, ఒంగోలు ఎన్‌ఎస్‌పీ సర్కిల్‌ పరిధిలో ఉన్న ప్రస్తుత బాపట్ల జిల్లాలో ఎనిమిది మంది అధ్యక్షులు ఉన్నారు. శనివారం నరసరావుపేటలోని కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రాజెక్టు కమిటీ ఎన్నికల్లో చైర్మన్‌గా పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గానికి చెందిన కారంపూడి డీసీ అధ్యక్షుడు పులుకూరి కాంతరావు ఎన్నికయ్యారు. వైస్‌చైర్మన్‌గా ఉమ్మడి జిల్లా పర్చూరు నియోజకవర్గానికి చెందిన కోనంకి డీసీ అధ్యక్షుడు ఉప్పలపాటి చక్రపాణి ఏకగ్రీవమయ్యారు. దీంతో సాగునీటి సంఘాల ఎన్నికల ప్రక్రియ ముగిసింది. జిల్లాలో 342 డబ్ల్యూయుఏలు, 10డీసీలు, మూడు ప్రాజెక్టు కమిటీలు ఉండగా అన్నింటిలోనూ టీడీపీ మద్దతుదారులైన రైతు ప్రతినిధులే ఎన్నికయ్యారు.

Updated Date - Dec 22 , 2024 | 01:19 AM