ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రాష్ట్ర స్థాయి ఖోఖోలో బంగారు పతకం సాధించాలి

ABN, Publish Date - Dec 19 , 2024 | 11:33 PM

రాష్ట్ర స్థాయి స్కూల్‌ గేమ్స్‌ ఖోఖో పో టీలలో ఉమ్మడి ప్రకాశం జిల్లా బాలుర జట్టు ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని సాధించాలని ఆర్‌ఐవో సైమన్‌ విక్టర్‌, డీఆర్‌ఐవో ఎర్రయ్య ఆకాంక్షించారు. రాష్ట్ర స్థాయి అండర్‌ - 19 స్కూల్‌ గేమ్స్‌ ఖోఖో పోటీలలో పాల్గొనే ఉమ్మడి ప్రకాశం జిల్లా బాలుర జట్టు శిక్షణ గురువారం పంగులూరులో ముగిసింది.

రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలలో పాల్గొనే ఉమ్మడి ప్రకాశం బాలుర జట్టు

ఆర్‌ఐవో సైమన్‌ విక్టర్‌

పంగులూరు, డిసెంబరు 19 (ఆంధ్రజ్యో తి) : రాష్ట్ర స్థాయి స్కూల్‌ గేమ్స్‌ ఖోఖో పో టీలలో ఉమ్మడి ప్రకాశం జిల్లా బాలుర జట్టు ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని సాధించాలని ఆర్‌ఐవో సైమన్‌ విక్టర్‌, డీఆర్‌ఐవో ఎర్రయ్య ఆకాంక్షించారు. రాష్ట్ర స్థాయి అండర్‌ - 19 స్కూల్‌ గేమ్స్‌ ఖోఖో పోటీలలో పాల్గొనే ఉమ్మడి ప్రకాశం జిల్లా బాలుర జట్టు శిక్షణ గురువారం పంగులూరులో ముగిసింది. ఎంఎ్‌సఆర్‌ అండ్‌ బీఎన్‌ఎం జూనియర్‌ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఎస్‌ఆర్‌ఆర్‌ ఖోఖో అకాడమీలో 20 రోజులు ఈ జట్టుకు శిక్షణ ఇచ్చారు. ఈ జట్టు ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు తిరుపతి జిల్లా పుత్తూరులో జరిగే అండర్‌ - 19 ఖోఖో పోటీలలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు. ప్రభుత్వ నిధులతో క్రీడాకారులకు సమకూర్చిన క్రీడా దుస్తులను కళాశాల ప్రిన్సిపాల్‌ ఉషారాణి క్రీడాకారులకు అందచేశారు.

జట్టులో పాల్గొనే క్రీడాకారులు

ఈ జట్టు తరఫున ఎన్‌.భరత్‌కుమార్‌, జి.సాయి, ఎస్‌.లక్ష్మణరావు, ఐ.ప్రవీణ్‌రెడ్డి, ఎల్‌.రవీంద్ర, ఎస్‌.మహే్‌షబాబు, సీహెచ్‌ గణేష్‌, సి.లక్ష్మీనరసింహ, సీహెచ్‌ బాజీబాబు, షేక్‌ బాషా, ధినేష్‌, కిషన్‌రెడ్డి ఆడనున్నట్లు స్కూల్‌ గేమ్స్‌ కార్యదర్శి చింపారెడ్డి గురువారం ప్రకటించారు. కోచ్‌గా ఎం.సీతారామిరెడ్డి, మేనేజర్లుగా షేక్‌ ఆలీనవాజ్‌, ఎన్‌.అజయ్‌ వ్యవహరిస్తారని చింపారెడ్డి తెలిపారు.

Updated Date - Dec 19 , 2024 | 11:33 PM