రంగాకు ఘన నివాళి
ABN, Publish Date - Dec 26 , 2024 | 11:05 PM
కాపు జాతి ఉన్నంత వరకు వంగవీటి మోహనరంగా పేరు చిరస్థాయిగా ఉంటుందని వంగవీటి రాధాకృష్ణ అన్నారు. మండలంలోని సోపిరాల రైల్వే గేటు సెంటర్‌లో మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన్‌రంగా 10 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కరణ గురువారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వంగవీటి రాధాకృష్ణ, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సోపిరాల రైల్వే గేటు సెంటర్‌లో రూ.25 లక్షలతో నిర్మించిన మోహన్‌రంగా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి, బస్ షెల్టర్‌లను ప్రారంభించారు.
కాపు జాతి ఉన్నంత వరకు రంగా పేరు పదిలకం
కాంస్య విగ్రహ ప్రారంభంలో ఎమ్మెల్యే ఏలూరి
చినగంజాం, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : కాపు జాతి ఉన్నంత వరకు వంగవీటి మోహనరంగా పేరు చిరస్థాయిగా ఉంటుందని వంగవీటి రాధాకృష్ణ అన్నారు. మండలంలోని సోపిరాల రైల్వే గేటు సెంటర్‌లో మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన్‌రంగా 10 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కరణ గురువారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వంగవీటి రాధాకృష్ణ, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సోపిరాల రైల్వే గేటు సెంటర్‌లో రూ.25 లక్షలతో నిర్మించిన మోహన్‌రంగా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి, బస్ షెల్టర్‌లను ప్రారంభించారు. అనంతరం రం గా వర్థంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ కమిషనర్ డాక్టర్ టీఎ్‌సఆర్.ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన సభలో మోహనరంగా తనయుడు రాధాకృష్ణ మా ట్లాడుతూ తన తండ్రికి మరణం లేదన్నారు. మరణించి మూడు దశాబ్దాలు అయిప్పటికీ ప్రజల మనస్సుల్లో సుస్థిరంగా ఉన్నారని అన్నారు. రంగా విగ్రహం పెట్టారంటే అందరికీ బాధ్యత పెరిగిందని అందరూ కలిసి రంగా ఆశయ సాధన దిశగా పని చేయాలన్నారు. మీ అభిమానానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు. రంగా విగ్రహావిష్కరణకు కృషి చేసిన ఎమ్మెల్యే ఏలూరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ రంగా అంటేనే పోరాటానికి దిక్యూచి అని, పేదల పాలిట పెన్నిధి అని అన్నారు. రంగా ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదని అన్ని వర్గాల ప్రజల మదిలో నిలిచిరన్నారు. తనయుడిగా రాధాకృష్ణ తం డ్రి ఆశయాల కోసం పని చేస్తున్నారన్నారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకున్నా స మాజం పట్ల అంకిత భావంతో పెదిగారని సమస్య ఎక్కడ ఉంటే ఆయన అక్కడ నిలిచి ప్రజలకు అండగా ఉన్నారని అన్నారు. రాధా చాలా సౌమ్యుడని, ఏది అశించకుండా ఆయ న తండ్రి పేరు ప్రఖ్యాతలను పెంపొందించేలా రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్నారన్నారు. రాఽధాకు అద్భుతమైన భవిష్యత్ ఉందని పదిమందికి ఉపయోగపడాలంటే రాజకీయ నేపథ్యంలోనే ఉండాలన్నారు. సోపి రాల గ్రామంలో రంగా విగ్రహం ఏర్పాటు చే యడం అభినంనీయమని అన్నారు. ఎమ్మెల్యే ఏలూరిని, రాధాని సోపిరాల గ్రామ పెద్దలు సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు. కాపు నాయకులను ఎమ్మెల్యే ఏలూరి సన్మానించి, మెమెంటోలు అందజేశారు. డీవీ సుబ్బారావు పాడిన సత్యహరిచంద్ర పద్యాలు అందరినీ అలరింపజేశాయి. ఆయన్ని ఏలూరి సన్మానించారు. కార్యక్రమంలో సౌత్ ఇండియా కేబీటీ కన్వీనర్ రాసరి రాము, కాపునాడు జాతీయ అధ్యక్షుడు గల్లా సుబ్రహ్మణ్యం, గాదె వెంక టేశ్వరరావు, ఆకుల తిరుమలరావు, ఉగ్గిరాల సీతారామయ్య, పొగడరండ రవికుమార్, మంత్రి శ్రీనివాసరావు, గోపాలకృష్ణ, తిరుమలశెట్టి శ్రీహరి, గొర్రెపాటి శ్రీనివాసరావు, జనసేన నేత ఆమంచి స్వాము లు, రజని, టీడీపీ మండల అధ్యక్షుడు పొడ వీరయ్య, సోపిరాల గ్రామ పెద్దలు ఆమంచి వెంకటసుబ్బారావు, టీ.జయరావు, కే.రామసుబ్బారావులు పాల్గొన్నారు
పర్చూరు : కాపు నేత వంగవీటి మోహన్ రంగా వర్ధంతి సందర్భంగా కాపు నేతలు ఘన నివాళి అర్పించారు. బొమ్మల సెంటర్‌లోని ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలతో వేసి అభిమానం చాటుకున్నా రు. పలువురు నేతలు మాట్లాడుతూ కాపు ల అభ్యున్నతి కోసం రంగా ఎంతగానో కృషిచేశారని కొనియాడారు. అనంతరం పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కా రంపూడి సందీ్‌పతేజ, కఠారి సురేంద్రబాబు, కోటా శ్రీనివాసరావు, రంగిశెట్టి ఆంజనేయలు, దీర్ఘాల రమేష్ నాయుడు, తులసి చంటి, కంచేటి శ్రీహరి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా లింగిశెట్టి రామాంజనేయులు సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఇంకొల్లు : ఇంకొల్లులో వంగవీటి మోహనరంగా వర్ధంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి పొన్నగంటి జానకిరామారావు ఆధ్వర్యంలో రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంత రం అన్నదాన కార్యక్రమం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కొత్తపేట (చీరాల) : రామ మందిరం సమీపంలోని జనసేన పార్టీ జెండా దిమ్మె వద్ద గురువారం వంగవీటి మోహన రంగా వర్ధంతి సందర్భంగా ఆయన అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. పలువురు మా ట్లాడుతూ రంగా ఒక కులానికో, వర్గానికో కాకుండా అందరి కోసం, ప్రధానంగా పేదల పక్షపాతిగా పనిచేశారని కొనియాడారు. ఆనాటి పరిస్థితులు, ఘటనలను మననం చేశారు. అనంతరం చీరాల ఏరియా వైద్యశాలలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చే శారు. కార్యక్రమంలో నాయకులు దాసరి రాము, తన్నీరు ప్రసాద్, మార్కండేయులు, శ్రీనివాసరావు, కిషోర్, శివరామప్రసాద్, నాగేశ్వరరావు, కిరణ్‌బాబు పాల్గొన్నారు.
Updated Date - Dec 26 , 2024 | 11:05 PM