అకాల వర్షం.. అపార నష్టం
ABN, Publish Date - Dec 26 , 2024 | 11:16 PM
మొన్న ఫెంగల్ తుఫాన్, నిన్న వాయుగుండం, నేడు అల్పపీడనం ఇలా 15 రోజుల వ్యవధిలో బంగాళాఖాతంలో ఏర్పడిన వరుస ఆవర్త నాల ప్రభావంతో మండలంలో అకాల వర్షం కురిసింది. ఈ వర్షంతో పంటలు దెబ్బతినడంతో పాటు పైర్లకు తెగుళ్లు చు ట్టుముట్టాయి. దీంతో రైతులకు తీరని నష్టం వాటిల్లింది. కొద్ది రోజుల్లో చేతికి వస్తుందనుకున్న పంట కాస్తా కళ్ల ఎదుటే దె బ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
మిరపను చుట్టుముట్టిన కొమ్మతెగులు
కాయలు పగిలి మొలకెత్తుతున్న మినుము
పూతరాలిన కంది
తడిచిన వరి ఓదెలు
రైతులకు కోలుకోలేని దెబ్బ
పీసీపల్లి, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): మొన్న ఫెంగల్ తుఫాన్, నిన్న వాయుగుండం, నేడు అల్పపీడనం ఇలా 15 రోజుల వ్యవధిలో బంగాళాఖాతంలో ఏర్పడిన వరుస ఆవర్త నాల ప్రభావంతో మండలంలో అకాల వర్షం కురిసింది. ఈ వర్షంతో పంటలు దెబ్బతినడంతో పాటు పైర్లకు తెగుళ్లు చు ట్టుముట్టాయి. దీంతో రైతులకు తీరని నష్టం వాటిల్లింది. కొద్ది రోజుల్లో చేతికి వస్తుందనుకున్న పంట కాస్తా కళ్ల ఎదుటే దె బ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలం లో ఖరీఫ్ సీజన్‌లో 12వేల ఎకరాల కంది, రబీ సీజన్‌లో 3400ఎకరాలకు పైగా మినుము, 500ఎకరాలకు పైగా మిర్చి, 500ఎకరాలలో వరి పంటలను రైతులు సాగుచేశారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం సాగు చేసిన పైర్లన్నీ తెగుళ్లు సోకకుండా పెరిగి మంచి కాపు పట్టాయి. వరుస అల్పపీడనా లతో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో కోతకు వచ్చిన మినుము పైరు తడిసి ముద్దయింది. కంది పూత రాలింది. మిరపకు తెగుళ్లు చుట్టుముట్టాయి. ఫలితంగా పంటలు దె బ్బతిన్నాయి. ఈ వర్షాలు రైతులకు కోలుకోలేని విధంగా నష్టం మిగిల్చాయి.
కాయలు పగిలి.. గింజ మొలకెత్తి
మండలంలో గుంటుపల్లి, తురకపల్లి, పె దయిర్లపాడు, లక్ష్మక్కపల్లి, మెట్లవారిపాలెం, శంకరాపురం, వరిమడుగు తదితర గ్రామా ల్లోని రైతులు ఎక్కువమొత్తంలో మినుము సా గుచేశారు. అకాల వర్షాలకు తడిచిన మినుము చెట్లపైనే కాయలు ఉబ్బి గింజలు మొలకెత్తాయి. కొన్ని ప్రాంతాలలో కోత లు కోసినప్పటికీ పంటపైనే వర్షానికి తడిసి ఉండడంతో గింజలు ఉబ్బి రంగు మారా యి. ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతులకు సగం పెట్టుబ డి కూడా రాదని ఆవేదన చెందుతున్నారు.
మిరపను చుట్టుముట్టిన తెగుళ్లు
అల్పపీడనాల ప్రభావంతో కురిసిన వర్షాలకు మిరప చేలలో తేమశాతం ఎక్కువైంది. దీంతో మిరపను కొమ్మతెగు లు, నల్లి, ఆకుముడతలు చుట్టుముట్టాయి. రైతులు రకరకాల రసాయనిక మందులు పిచికారీ చేసినా తెగుళ్లు అదుపులోకి రావడంలేదు. కొమ్మతెగులు సోకిన చెట్ల కొమ్మలు బూజుపట్టి విరిగిపోతున్నాయి. చెట్లకు ఉన్న కాయలు కుళ్లిపోయి కోయ కుండానే రాలిపోతున్నాయి. ఇప్పటికే ఎకరాకు సుమారు లక్ష రూపాయల వరకు రైతులు పెట్టుబడి పెట్టారు.తెగుళ్లు అదు పులోకి రాకపోవడంతో పాటు కళ్లముందే కాయలు రాలిపో తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
కంది పూత రాలి..
మండలంలో 12వేల ఎకరాలలో రైతులు కంది పంటను సాగుచేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు కందిచెట్లపై ఉన్న పూత రాలిపోయింది. దాంతోపా టు అధిక వర్షాలతో భూమిలో తేమశాతం ఎక్కువైంది. దీంతో మండలంలోని ముద్దపాడు, పెద్ద న్నపల్లి, తలకొండపాడు, పీసీపల్లి, నేరేడుపల్లి తదితర ప్రాంతాల్లో కందిపైరు ఆకులు ఎర్రగా మారి రాలిపోతున్నాయి. చెట్లు ఎండిపో తున్నాయి. ఈ ఏడాది అపరాల దిగుబడి బాగా వస్తుందని ఆశించిన రైతుల ఆశలపై తుఫాన్ నీళ్లు చల్లింది. కంది సాగు కోసం రైతులు ఇప్పటికే ఒక్కో ఎక రాకు రూ.16 వేల నుంచి రూ.22 వేల వరకు ఖర్చుచేశారు.
రైతు కష్టం వర్షార్పణం
కురిచేడు : గత మూడు రోజులుగా కురు స్తున్న వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. తమ కష్టమంతా వర్షార్ప ణం అయిందని వాపోతు న్నారు. కురిచేడు మండ లంలో సాగర్ ఆయకట్టు కింద మాగాణి సాగు చేసిన రైతులు ఎక్కువగా బీపీటీ రకం వరి సాగు చేశారు. ప్రస్తుతం కోతలు కోస్తున్నారు. కోసిన వరి ఓదెలు పొలంలో ఉండ గానే అకాల వర్షాలు వా టిని ముంచెత్తాయి.. మునిగిన వరి ఓదెల నుంచి గింజలు మొలకెత్తడంతో రైతులు తీవ్రంగా నష్టపో యారు. మిర్చి పంట కోసి కల్లాలో ఉండగానే వర్షం కురవ డంతో పరదాలు కప్పే లోపే తడిచిపోయాయి. కాయలు ఆరబెట్టే అవకా శం లేకుండా మూడు రోజుల నుంచి కాయలు పరదాల చాటున ఉండటంతో మిరప కాయలకు బూజు పట్టి తెల్లగా వ చ్చాయి. మండలంలోని ఆవులమందన కల్లూరు, పమర నాయుడుపాలెం, వెంగాయపాలెం గ్రామా లలో వరి ఓదెలు తడవ డంతో పాటు మిర్చి రంగు మారి రైతులు తీవ్రంగా నష్టపో యారు. పొలాల నుంచి ఇంటికి చేరేది ఏమీ లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. మరో రోజు కూడా వర్షం ఉందని వాతావరణ శాఖ సూచనలతో రైతులు ఆందోళన చెం దుతున్నారు.
రైతులకు తీవ్రనష్టం
పామూరు, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): అల్పపీడన ప్రభావంతో కురిసిన ముసురు వానతో మినుము, పొగా కు శనగ రైతులకు కోలుకోని దెబ్బ తగిలింది. పామూరు, మండలంలో 888 హెక్టార్లలో మినుము, సీఎస్‌పురం మం డలంలో 700 ఎకరాల్లో మినుము పంటను సాగు చేశారు. మినుము పైరు బూజు పట్టి మొలక రావడంతో నష్టపోతు న్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలతో పొగాకు నాణ్యత తగ్గిపోతుందని రైతులు వాపోతున్నారు. మండ లంలో 599 హెక్టార్లల్లో సాగులో ఉన్న కంది పైరు వర్షాల ప్రబావంతో పూత రాలిపోయిం దని దిగాలు చెందుతున్నారు. ఈపాటికే శనగ పంట దెబ్బతినడంతో ప్రభుత్వం 80 శాతం రాయితీపై తిరిగి విత్తనాలు అందచేయడంతో రైతులు సాగు చేస్తున్నారు. రబీ సీజన్‌లో అకాల వర్షాలు రైతుల వెన్ను విరిశాయి.
వర్షంతో రైతుల ఆందోళన
దొనకొండ : మండలంలో ని గ్రామాల్లో మూడు రోజులుగా కురుస్తున్న ముసురు వర్షం రైతులను ఆందోళనలను గురిచేస్తుంది. కోసి కల్లాల్లో ఉంచిన మిర్చి తడిసి రంగుమారే పరిస్థితి నెలకొంది. దీంతో తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆందోళన చెందు తున్నారు. చెట్టుమీద ఉన్న మిర్చి కాయకు ఇప్పటికే కొంతమేర జెమినీ వైరస్ సోకింది. ఈ ముసురు వర్షం ఆగకపోతే నష్టం తప్ప దని పలువురు రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న ముసురు వర్షానికి కంది పూత, పిందె రాలిపోతుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
దిగుబడులపై ప్రభావం
తాళ్లూరు, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు ఆందోళన చెందుతు న్నారు. వరి ఓదెలు తడిసిపోవడంతో నష్టం వాటిల్లుతుంది. పొగాకు నాణ్యతపై ఈవర్షం ప్రభావం చూపుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎడతెరపి లేకుండా కు రుస్తున్న వర్షంతో కంది పూత రాలిపోతుండటంతో దిగు బడులు తగ్గుతాయని రైతులు పేర్కొన్నారు.
దెబ్బతిన్న పంటలు
ముండ్లమూరు : అల్పపీ డన ప్రభావంతో గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. వరి నూర్పిళ్ళు చేయటానికి రైతులు సిద్ధమవుతుండగా వర్షాలతో కుప్పలు నానిపోయా యి. వైట్ బర్లి పొగాకు, మొక్క జొన్న, కంది పంటలు కూడా దెబ్బతిన్నాయి. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పంట చేతికొచ్చే సమయానికి వానపాలు అయిందని రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. పసుపుగ్లు, చింతల పూడి, ముండ్లమూరు, సింగనపాలెం, చంద్రగిరి, వేములబం డ, కమ్మవారిపాలెం గ్రామాల్లో వరి ఎక్కువగా సాగు చేశారు. శంకరాపురం, పోలవరం, నూజెండ్లపల్లి, సుంకరవారిపాలెం, మారెళ్ళ, పూరిమెట్ల, తమ్మలూరు, పసుపుగల్లు గ్రామాల్లో కంది సాగు చేశారు. ప్రస్తుతం పూత, పిందె దశలో ఉండగా ముసురుతో దెబ్బతిన్నాయి. మొక్కజొన్న, వైట్ బర్లీని కూడా వర్షం దెబ్బతీసింది. ఈ వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి.
రైతులను నట్టేట ముంచిన వర్షం
కనిగిరి : అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కనిగిరి నియోజకవర్గంలో రైతులు అత్యధికంగా మినుము సాగుచేశారు. ఈ వర్షాలతో మినప కాయలు ఉబ్బి కాయలు కుళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. కనిగిరి మండలంలో 1108 హెక్టార్లు, పామూ రులో 888 హెక్టార్లు, పీసీపల్లిలో 1320 హెక్టార్లు, సీఎస్ పురంలో 505 హెక్టార్లు, హెచ్‌ఎంపాడులో 1287 హెక్టార్లు, వెలిగండ్ల మండలంలో 387 హెక్టార్లులో మినుము సాగు చేశారు. అకాల వర్షంతో 666 హెక్టార్లలో పంట పూర్తిగా దెబ్బతింది. అత్యధికంగా పామూరు, సీఎస్‌పురం మండలాల్లో మినుము దెబ్బతిన్నట్లు వ్యవసాయాధికారులు ప్రాథమికంగా నష్టాన్ని అంచనా వేశారు. కొన్ని ప్రాంతాల్లో మినుము కోసి ఓదెలు వేశారు. ఈవర్షాలకు ఓదెలు తడిచి కల్లాల్లోనే కాయ కుళ్ళిపోయి పంట దక్కే పరిస్థితి లేకుండా పోయింది. కంది పంటను నియోజకవర్గంలో 20వేల హెక్టార్లులో చేశారు. వర్షాలతో కంది పంట చేతికొచ్చే పరిస్థితి లేకుండా పోయిం ది. శనగది అదేపరిస్థితి. అకాల వర్షంతో పంట నష్టాన్ని అంచనా వేసేందుకు ఏడీఏ ఈవీ రమణ సిబ్బందితో కలసి కనిగిరి మండలంలో గురువారం పొలాలను పరిశీలించారు.
Updated Date - Dec 26 , 2024 | 11:16 PM