President Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపీ పర్యటన.. షెడ్యూల్ ఇదే!
ABN, Publish Date - Dec 16 , 2024 | 06:36 PM
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఏపీలో పర్యటించనున్నారు. పర్యటన షెడ్యూల్ ఏంటంటే..
గుంటూరు జిల్లా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఏపీలో పర్యటించనున్నారు. ఉదయం రాష్ట్రానికి రానున్న రాష్ట్రపతి అదే రోజు సాయంత్రం హైదరాబాద్‌కు బయలుదేరతారు. పర్యటన షెడ్యూల్ ప్రకారం, ఉదయం 8.35 గంటలకు రాష్ట్రపతి ముర్ము ఢిల్లీ నుంచి విజయవాడకు బయలుదేరతారు. ఉదయం 11.30 గంటలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటారు (Andhrapradesh).
AP News: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ.. చర్చించిన అంశాలు ఇవే..
అనంతరం 12.05 గంటలకు మంగళగిరి ఎయిమ్స్‌లో స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరువుతారు. ఇందులో భాగంగా 49 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు పట్టాలు, నలుగురు విద్యార్థులకు బంగారు పతకాల బహూకరిస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు రాష్ట్ర గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం రాష్ట్రపతి విజయవాడ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్‌కు ప్రయాణమవుతారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎయిమ్స్ మంగళగిరి పరిసరాల చుట్టూ పోలీసు పహారా ఏర్పాటు చేశారు.
CM Chandrababu: నేను అన్ని డెడ్‌లైన్లు పూర్తి చేశా.. కానీ విధి డెడ్‌లైన్ మార్చింది
Read Latest and Andhrapradesh News
Updated Date - Dec 16 , 2024 | 06:53 PM