ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అగ్రరాజ్యంలో తెలుగోళ్ల హవా..!

ABN, Publish Date - Oct 12 , 2024 | 04:34 AM

అమెరికాలో తెలుగువారి ప్రాబల్యం విపరీతంగా పెరిగిపోతోంది. మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు గౌరవం కూడా పెరుగుతోంది.

Telugu People

  • అధ్యక్ష ఎన్నికల్లో మనవాళ్లకు పెరిగిన ప్రాధాన్యం

  • అమెరికా వీధుల్లో దర్శనమిస్తున్న తెలుగు బ్యానర్లు

  • ‘సంస్కృతి, సన్మార్గం-దేశానికి ఆధారం’ నినాదంతో రిపబ్లికన్లకు మద్దతుగా వెలిసిన బ్యానర్లు

అమరావతి, అక్టోబరు 11 (ఆంరఽధజ్యోతి): అమెరికాలో తెలుగువారి ప్రాబల్యం విపరీతంగా పెరిగిపోతోంది. మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు గౌరవం కూడా పెరుగుతోంది. భారతీయ పండుగలకు అమెరికాలో సెలవులు ఇస్తున్నారు. అక్కడి వీధులకు భారతీయ ప్రముఖుల పేర్లు పెడుతున్నారు. తాజా ఎన్నికల ప్రచారంలోనూ తెలుగులో రాసి ఉన్న బ్యానర్లు అమెరికా వీధుల్లో దర్శనమిస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే అగ్రరాజ్యంలో మనవాళ్ల హవా ఎంతగా పెరిగిందో, అక్కడ మన తెలుగోళ్లు ఎదిగారో అర్థమవుతోంది. ప్రస్తుతం అమెరికాలో ఎన్నికల ప్రచారం హడావుడి నెలకొంది. ఈ నేపథ్యంలో ‘తెలుగు, సన్మార్గం - దేశానికి ఆధారం’ అని రాసిన బ్యానర్లు అమెరికా వీధుల్లో దర్శనమిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అలాగే తమిళంలో రాసిన బ్యానర్లు కూడా కనిపిస్తున్నాయి. ప్రచారంలో భాగంగా రిపబ్లికన్లకు మద్దతుగా డల్లా్‌సలో వెలిసిన ఈ బ్యానర్లు అక్కడ మనవాళ్ల దక్కుతున్న ప్రాధాన్యతను చాటిచెబుతున్నాయి.

  • సెనేటర్ల నుంచి.. అధ్యక్షుడి పీఠం వరకూ..

ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి, అక్కడే ఉద్యోగ, వ్యాపారాల్లో స్థిరపడుతున్న తెలుగు వారి సంఖ్య ప్రతిఏటా పెరుగుతోంది. ఈ క్రమంలోనే అమెరికాలో ప్రవాసాంధ్రులు, భారతీయుల హవా కొనసాగుతోంది. అక్కడ అన్ని రంగాల్లోనూ తెలుగువారు, భారతీయులు సత్తా చాటుతున్నారు. అమెరికా రాజకీయాల్లో కూడా కీలకంగా మారుతున్నారు. భారత సంతతికి చెందినవారు అమెరికాలో పార్లమెంటు సభ్యుల స్థాయి నుంచి నేడు ఏకంగా అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే వరకూ ఎదిగారు. ఈ ఏడాది నవంబరు 5న జరగనున్న ఎన్నికల్లో అమెరికా అధ్యక్ష పీఠం కోసం డెమోక్రాట్లు, రిపబ్లికన్లు హోరాహోరీగా పోరాడుతున్నారు.


రిపబ్లికన్ల తరఫున అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి అధ్యక్ష పీఠం కోసం పోటీ పడుతున్నారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పోటీ నుంచి వైదొలగడంతో డెమోక్రాట్ల తరఫున భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ బరిలో ఉన్నారు. ఆమె తమిళనాడు మూలాలున్న వ్యక్తి కావడంతో ఆమెకు తమిళులు మద్దతుగా నిలుస్తున్నారు. మరోవైపు రిపబ్లికన్ల తరఫున ఉపాధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బలపర్చిన వాన్స్‌ భారత సంతతికి చెందిన తెలుగమ్మాయి ఉషా చిలుకూరి భర్త కావడం విశేషం. దీంతో అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఎవరు గెలిచినా భారత్‌కు గర్వకారణంగా నిలవనుంది. డెమోక్రాట్లు గెలిస్తే భారతీయ మూలాలున్న కమలా హారిస్‌ అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించి చరిత్ర సృష్టిస్తారు. రిపబ్లికన్లు గెలిస్తే డొనాల్డ్‌ ట్రంప్‌ బలపర్చిన వైస్‌ ప్రెసిడెంట్‌ అభ్యర్థి వాన్స్‌తోపాటు ఆయన సతీమణి, మన తెలుగమ్మాయి ఉషాకు కూడా సముచిత గౌరవం దక్కుతుంది.

  • తెలుగోళ్లను ప్రసన్నం చేసుకునే పనిలో..

తాజా ఎన్నికల్లో భారత సంతతికి చెందిన వ్యక్తులు చాలామంది బరిలో ఉన్నారు. వారిలో ఎవరు విజయం సాధిస్తారనేది త్వరలోనే తెలుస్తుంది. ఇప్పటి వరకు జరిగిన అమెరికా ఎన్నికల్లో ప్రవాసాంధ్రులు, భారతీయులు పెద్దగా చొరవ చూపించకపోయినా.. ఈసారి ఎన్నికల్లో మాత్రం కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా ప్రవాసాంరఽధులు ఏ పార్టీ వైపు ఉన్నారనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఇరు పార్టీలవారు భారతీయ సంతతితోపాటు, తెలుగు ఓటర్లను ప్రస న్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో ఉంటున్న తెలుగువారు, భారతీయులు ఏపార్టీ వైపు మొగ్గు చూపుతారనేది కీలకంగా మారింది.

Updated Date - Oct 12 , 2024 | 09:28 AM