ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దాచేపల్లిలో ప్రబలిన అతిసారం

ABN, Publish Date - Oct 25 , 2024 | 04:18 AM

పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీలోని అంజనాపురం కాలనీలో అతిసారం ప్రబలింది. కాలనీలో రెండు రోజులుగా 16 మంది వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు.

  • ఇద్దరు మృతి, 14 మందికి అస్వస్థత

దాచేపల్లి/నరసరావుపేట/అమరావతి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీలోని అంజనాపురం కాలనీలో అతిసారం ప్రబలింది. కాలనీలో రెండు రోజులుగా 16 మంది వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వీరిలో డిగ్రీ విద్యార్థి తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు(21) చికిత్స పొందుతూ బుధవారం మృతి చెం దాడు. పక్షవాతంతో బాధపడుతున్న బండారు చిన వీరయ్య(63) ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. వ్యాధి తీవ్రత అధికంగా ఉండటంతో పట్టణ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అతిసారానికి కారణం కలుషిత తాగు నీరేనని ప్రాథమికంగా అధికారులు తేల్చారు.

తాగునీటి పైపు లైన్లు మురుగు కాలువలో ఉండటం వల్ల నీరు కలుషితమై ఉండవచ్చని భావిస్తున్నారు. తాగునీరు రంగు మారి, వాసన వస్తున్నట్టు నిర్ధారించారు. ఇద్దరు మృతి చెందడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కాలనీలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి డయేరియా లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తించి చికిత్స అందజేస్తున్నారు. డీఎంహెచ్‌వో డాక్టర్‌ రవి నేతృత్వంలో వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. కాలనీలో ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టారు. వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ శిరి గ్రామాన్ని సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు. కలెక్టర్‌ అరుణ్‌బాబు, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కాలనీలో పరిస్థితిని సమీక్షించారు.


  • మంత్రి నారాయణ సమీక్ష

అంజనాపురం కాలనీలో వాంతులు, విరేచనాలతో ఇద్దరు మృతి చెందిన ఘటనపై మున్సిపల్‌ శాఖ మంత్రి పొంగూరు నారాయణ సమీక్షించారు. తాగునీటిని ల్యాబ్‌కు పరీక్షల కోసం పంపాలని అధికారులను ఆదేశించారు. బోర్లను మూసి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేయాలని సూచించారు. సాధారణ పరిస్థితి వచ్చే వరకు మున్సిపల్‌, వైద్యఆరోగ్య శాఖ అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలని అదేశించారు.

  • వైద్య శిబిరాలు ఏర్పాటు చేయండి: గొట్టిపాటి ఆదేశం

దాచేపల్లిలో అతిసారంతో ఇద్దరు మృతి చెందడంతో జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. విస్తృతంగా వైద్య శిబిరాలను నిర్వహించాలని ఆదేశించారు. సంబంధిత ప్రాంతాల్లో క్లోరినేషన్‌ ముమ్మరం చేయాలని, డయేరియాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

Updated Date - Oct 25 , 2024 | 04:19 AM