Share News

AP News: మనస్సు చాలా గాయపడింది

ABN , Publish Date - Apr 10 , 2024 | 07:35 PM

అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకుల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజా దుర్గ గుడి పాలక మండలి చైర్మన్ పైలా సోమి నాయుడు జగన్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉంటూ వైయస్ రాజశేఖర్ రెడ్డి అనుచరుడుగా కాంగ్రెస్ పార్టీలో పని చేశానని తెలిపారు.

AP News: మనస్సు చాలా గాయపడింది
pyla swamy naidu

విజయవాడ, ఏప్రిల్ 10: అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకుల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజా దుర్గ గుడి పాలక మండలి చైర్మన్ పైలా సోమి నాయుడు జగన్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉంటూ వైయస్ రాజశేఖర్ రెడ్డి అనుచరుడుగా కాంగ్రెస్ పార్టీలో పని చేశానని తెలిపారు. ఆ క్రమంలో గతంలో పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం టికెట్‌ ఆశించానని.. కానీ తనకు సీటు ఇవ్వలేదన్నారు. అయితే 2009 అసెంబ్లీ ఎన్నికల్లో మల్లికా బేగంకు అసెంబ్లీ సీట్ ఇచ్చారని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు.

Bhanu Prakash: అభినయ్, ధర్మారెడ్డిలపై సంచలన వ్యాఖ్యలు

అనంతరం 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారు. దీంతో 2017లో రాష్ట్ర వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా తనను నియమించారన్నారు. అలాగే 2018లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారని చెప్పారు. అనంతరం 2020లో దుర్గ గుడి పాలక మండలి చైర్మన్‌గా తనను నియమించారన్నారు. అనంతరం దుర్గ గుడి పాలక మండలి చైర్మన్‌గా తనను కొనసాగించాలని పార్టీ పెద్దలను కలిసి కోరానని.. అయితే మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అందుకు సహకరించ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Chandrababu: జగన్‌ను భూస్థాపితం చేస్తాం.. చీకటి పాలనను అంతం చేస్తాం: చంద్రబాబు


నగరాల సామాజిక వర్గానికి చెందిన తాను.. రాజకీయాల్లో ఉంటూ నా సేవలను అందరికీ అందించానని ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. అయినా వైయస్ఆర్ సీపీ మాత్రం తనకు టికెట్ కేటాయించలేదన్నారు. మరోవైపు విజయవాడ లోక్‌సభ వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన కేశినేని నాని నుంచి ఇంత వరకు తనకు పిలుపు రాలేదన్నారు. అదీకాక వైయస్ఆర్ సీపీలో తనకు జరిగిన అన్యాయాలు, అవమానాలకు తన మనస్సు చాలా బాధపడిందని.. అందుకే ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. రాజకీయాల్లోనే ఉంటా.. రాజకీయాలు చేస్తానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. అయితే ఏ పార్టీ ద్వారా ప్రజలకు సేవలందిస్తానని.. తదుపరి కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానని సోమి నాయుడు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ వార్తలు కోసం..

Updated Date - Apr 10 , 2024 | 07:41 PM