Andhra Pradesh: ఏపీలో ఎలుకలు చాలా జాదూ గురూ.. ఇలా చేశాయేంటో..!
ABN, Publish Date - Jul 12 , 2024 | 01:22 PM
దేశంలోని అన్ని ప్రాంతాల్లోని ఎలుకలు.. ఏపీ ఎలుకలు వేరు. ఎందుకంటే ఏపీలోని ఎలుకలు చాలా జాదూ.. అవి ఏకంగా ఫైళ్లనే తగుల బెట్టాయి తెలుసా? వినడానికి విచిత్రంగా ఉన్నా మైనర్ ఇరిగేషన్ శాఖ సిబ్బంది చెబుతున్న వాస్తవమిది.
విజయవాడ: దేశంలో ఉన్న ఎలుకలందు.. ఏపీలో (Andhra Pradesh) ఎలుకలు వేరు! అవును మీరు వింటున్నది నిజమే..! ఎందుకంటే ఏపీలోని ఎలుకలు చాలా జాదూ..! అవి ఏకంగా ఫైళ్లనే తగుల బెట్టాయ్..! వినడానికి విచిత్రంగా ఉన్నా మైనర్ ఇరిగేషన్ శాఖ సిబ్బంది చెబుతున్న వాస్తవమిది. విజయవాడలో ఓ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఫైళ్లన్నీ తగులబడిపోయాయి. అసలు ఆ అగ్ని ప్రమాదం ఎలా జరిగిందా? అని ఆరా తీసిన అధికారులకు మైనర్ ఇరిగేషన్ శాఖ సిబ్బంది షాకింగ్ రిప్లై ఇచ్చారు. అదేంటంటే.. ఎలుకలట.. వైర్లను కొరికాయట.. తద్వారా అగ్నిప్రమాదం జరిగిందట. ఫైళ్లు తగలబడిపోయాయట. ఇదీ సంగతి.
ఫైళ్లను తగులబెట్టేసి నోరు లేని ఎలుకలపై నెపం నెట్టేశారు సదరు సిబ్బంది. ఈ మొత్తం ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వారం రోజుల నుంచి ఫైళ్లు ఆఫీస్ దాటుతున్నాయని అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. సడెన్‌గా గత రాత్రి అగ్నిప్రమాదంలో పూర్తిగా ఫైళ్లు కాలిపోయాయి. నీటిపారుదల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నిన్న అర్థరాత్రి కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగినట్టు పోలీసులకి ఫిర్యాదు అందింది. మంటలను ఫైర్ సిబ్బంది అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో రికార్డులు ఫైళ్లు, కంప్యూటర్లు పూర్తిగా కాలిపోయాయి. ఉద్దేశపూర్వకంగా చేశారా లేక ప్రమాదమా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగింది. ఎలుకలు వైర్లు కొరకడం వలన అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Gudivada Amarnath: ‘తల్లికి వందనం’ పథకంపై అమర్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
Arvind Kejriwal: సుప్రీంలో కేజ్రీవాల్‌కు బెయిల్
Read Latest AP News AND Telugu News
Updated Date - Jul 12 , 2024 | 01:55 PM