ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

YS Jagan: పేదల సాక్షిగా పచ్చి అబద్ధాలు!

ABN, Publish Date - Feb 24 , 2024 | 03:49 AM

పేదల సాక్షిగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అలవోకగా పచ్చి అబద్ధాలను చెప్పారు. ఒంగోలులో నివాస స్థల పట్టాల పంపిణీపై హైకోర్టులో వైసీపీ నేత పిల్‌ వేయగా, చంద్రబాబే కోర్టుకు వెళ్లినట్లుగా జనాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు.

  • ఒంగోలు సభలో సీఎం జగన్‌ వింత వ్యాఖ్యలు

  • స్థలాలపై కోర్టులో కేసు వేసింది వైవీ అనుచరుడే

  • కానీ.. చంద్రబాబు వేయించారన్న జగన్‌

  • భువనేశ్వరి వ్యాఖ్యల వక్రీకరణ

  • సభకు డ్వాక్రాలు, మహిళల తరలింపు

  • సీఎం ప్రసంగిస్తుండగానే వెనుదిరిగిన జనం

  • ఆర్టీసీ, స్కూలు బస్సులను లాక్కోవడంతో

  • అవస్థలు పడిన విద్యార్థులు, ప్రయాణికులు

ఒంగోలు, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): పేదల సాక్షిగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి (CM YS Jagan Mohan Reddy) అలవోకగా పచ్చి అబద్ధాలను చెప్పారు. ఒంగోలులో నివాస స్థల పట్టాల పంపిణీపై హైకోర్టులో వైసీపీ నేత పిల్‌ వేయగా, చంద్రబాబే కోర్టుకు వెళ్లినట్లుగా జనాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఒంగోలులో సుమారు 21వేల మందికి నివాసస్థల పట్టాల పంపిణీ కార్యక్రమంలో శుక్రవారం సీఎం జగన్‌ ప్రసంగించారు. తొలుత ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. పట్టాల పంపిణీని అడ్డుకునేందుకు కొందరు కోర్టులో పిల్‌ వేశారని, అయినా ప్రక్రియ ఆగలేదని చెప్పారు. ఆ తర్వాత సీఎం జగన్‌ మాట్లాడుతూ.... రాష్ట్రవ్యాప్తంగా పేదలకు పట్టాలు పంపిణీ వ్యవహారాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు 1900 వరకు కేసులు వేశారని చెబుతూ, ఒంగోలు పట్టాలు పంపిణీపై కోర్టులో పిల్‌ వేసింది కూడా ఆ మహానుభావుడేనని వ్యాఖ్యానించారు. అయితే నిజానికి కోర్టులో పిల్‌ వేసింది వైసీపీ నేత సింగరాజు రాంబాబు. గత ఎన్నికల్లో బాలినేని పక్షాన పనిచేసిన ఆయన ఆ తర్వాత ఆయనకు దూరమై రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డికి చేరువయ్యారు. ప్రస్తుతం ఆయన వైసీపీలోనే కొనసాగుతున్నారు. ఇది ప్రజలకు, వైసీపీ నేతలకు తెలిసిన నగ్నసత్యం. వైసీపీ స్థానిక నేతల మధ్య విభేదాలే దీనికి కారణం. అయినా, జగన్‌ మాత్రం ఆ పాపం చంద్రబాబుదే అంటూ పదేపదే వ్యాఖ్యానించటంతో వేదిక మీద ఉన్న జిల్లాకు చెందిన వైసీపీ నేతలే గాక సభకు హాజరైన వారు కూడా నివ్వెరపోయారు. అలాగే... చిత్తూరు జిల్లా పర్యటనలో భువనేశ్వరి ఎన్నికల కురుక్షేత్రానికి మనం సైసై అంటూ.... మీరూ సై యేనా అని అడగ్గా ప్రజలు సైసై అంటూ నినాదాలు చేశారు. తన పోటీపై సరదా వ్యాఖ్యలు మాత్రమే చేశారు. దీనిని కూడా జగన్‌ వక్రీకరించారు. ‘‘నేను ఎన్నికలకు సిద్ధం అంటే బాబు భార్య మాత్రం మా ఆయన సిద్ధంగా లేడంటున్నారు. నేను సైసై అంటే బైబై అంటున్నారు’’ అని జగన్‌ వ్యాఖ్యానించారు తన అబద్ధాలతో ప్రజలను నమ్మించేందుకు తడబడుతూ విశ్వప్రయత్నం చేశారు. ఒంగోలులో పేదలకు పట్టాలు పంపిణీ కోసమే ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పేరును సీఎం కనీసం ప్రస్తావించలేదు. దీంతో బాలినేని, ఆయన అనుచరులు అసంతృప్తికి గురయ్యారు.

మాగుంట దూరం

సీఎం సభకు స్థానిక ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి గైర్హాజరయ్యారు. అసంతృప్తితో ఉన్న దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌, గత ఎన్నికల అనంతరం వైసీపీలో చేరిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావు కూడా సభకు దూరంగా ఉన్నారు. ఉమ్మడి ప్రకాశంలో ఎక్కడ సీఎం కార్యక్రమం జరిగినా వచ్చి కలిసే చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ సభ వైపు రాలేదు. ఇటీవల పర్చూరు ఇన్‌చార్జిగా ఆయనను తొలగించి వేరేవారిని నియమించటం, చీరాల టికెట్‌ విషయంలో ఆయన మాటను పరిగణనలోకి తీసుకోకపోవటంతో ఆమంచి అసంతృప్తితో ఉన్నారు. అద్దంకి ఇన్‌చార్జిగా తొలగించిన కృష్ణచైతన్య ఆయన తండ్రి, మాజీ ఎమ్మెల్యే గరటయ్య, మరికొందరు నాయకులు కూడా సభకు దూరంగా ఉన్నారు.

సీఎం మాట్లాడుతుండగానే జనం పరార్‌

సీఎం సభ కోసం కుటుంబం నుంచి కనీసం ఇద్దరు రావాలంటూ అధికారపార్టీ నేతలు బెదిరింపులకు దిగారు. కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, వలంటీర్లు, మెప్మా ఆర్పీల ద్వారా మహిళలను భారీగా తరలించారు అందుకోసం జిల్లాతోపాటు ఇతర జిల్లాలకు చెందిన 506 ఆర్టీసీ బస్సులు, జిల్లాకు చెందిన 385 స్కూలు బస్సులు, మరికొన్ని ప్రైవేటు బస్సులను డివిజన్ల వారీగా ఏర్పాటు చేశారు. చాలామంది మహిళలు....సీఎం ప్రసంగం ప్రారంభం కాగానే అనేక మంది వెనుతిరిగి వెళ్లడం కనిపించింది. ఒంగోలు వెలుపల పొలాల్లో రవాణా, ఇతరత్రా ఎలాంటి సౌకర్యాలు లేని ప్రాంతం కావడంతో మహిళలు అవస్థలు పడాల్సి వచ్చింది. ఎఫ్‌ఏ-4, ప్రీఫైనల్‌ పరీక్షలకు గురువారం హాజరు కావడానికి ఆర్టీసీ బస్సులు లేక విద్యార్థులు అల్లాడారు.

చెవిరెడ్డే ఒంగోలు ఎంపీ అభ్యర్థి

స్థలాల పంపిణీ అనంతరం స్థానిక నాయకులను జగన్‌ కలిశారు. చంద్రగిరి ఎమ్మెల్యే, వైసీపీ రీజనల్‌ కోఆర్డినేటరు చెవిరెడ్డి భాస్కరరెడ్డిని చూపిస్తూ.. ‘ఈయనే మీ ఎంపీ అభ్యర్థి’ అని పరిచయం చేశారు. చివర్లో వెళ్లే సమయంలో జడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మను మార్చి తర్లుపాడు జడ్పీటీసీ సభ్యురాలు వెన్నా ఇందిరను చేయాలని జగన్‌ చెప్పటంతో అందరూ విస్మయం చెందారు. వెంకాయమ్మ కుమారుడు శివప్రసాదరెడ్డికి దర్శి టికెట్‌ను ఖరారు చేశారు. సీఎం ఆకస్మిక నిర్ణయంతో హెలిప్యాడ్‌ వద్దకు వెళ్లిన శివప్రసాదరెడ్డి....తన తల్లిని మార్చవద్దని వేడుకున్నారని సమాచారం. అయితే, ఒకరికి ఒక పదవి చాలులే అంటూ సీఎం అక్కడనుంచి వెళ్లిపోయారు.

Updated Date - Feb 24 , 2024 | 07:57 AM

Advertising
Advertising