ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా విడుదల రూ.7,211 కోట్లు మంజూరు

ABN, Publish Date - Oct 11 , 2024 | 03:33 AM

కేంద్ర పన్నుల్లో అక్టోబరు నెలకు సంబంధించి రాష్ర్టాలకు రావలసిన వాటాను కేంద్రప్రభుత్వం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 28 రాష్ర్టాలకు రూ.1,78,173 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది.

  • పండగల నేపథ్యంలో అక్టోబరు నెల వాయిదా ముందుగానే చెల్లింపు

  • తెలంగాణకు రూ.3,745 కోట్లు

  • పట్టణ స్థానిక సంస్థలకు 298 కోట్ల నిధులు

  • పండుగల నేపథ్యంలో అక్టోబరు నెల వాయిదా ముందుగానే చెల్లింపు

న్యూఢిల్లీ, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): కేంద్ర పన్నుల్లో అక్టోబరు నెలకు సంబంధించి రాష్ర్టాలకు రావలసిన వాటాను కేంద్రప్రభుత్వం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 28 రాష్ర్టాలకు రూ.1,78,173 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. అందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,211 కోట్లు, తెలంగాణకు రూ.3,745 కోట్లు విడుదల చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల పన్నుల వాటా కింద రాష్ర్టాలకు కేంద్రం రూ.89,087 కోట్లను చెల్లించాల్సి ఉంది. అయితే.. దసరా, దీపావళి నేపథ్యంలో మూలధన వ్యయాన్ని వేగవంతం చేసే ఉద్దేశంతోనే ముందస్తు వాయిదా (అడ్వాన్స్‌ ఇన్‌స్టాల్‌మెంట్‌) రూ.89,086 కోట్లను కలిపి మొత్తం రూ.1,78,173 కోట్లను విడుదల చేస్తున్నట్లు పేర్కొంది.

అడ్వాన్స్‌ ఇన్‌స్టాల్‌మెంట్‌ చెల్లించడం వల్ల రెండు తెలుగు రాష్ర్టాలకు గత నెల కంటే పన్నుల్లో వాటా గణనీయంగా పెరిగింది. పండుగల సీజన్‌లో అభివృద్థి, సంక్షేమ సంబంధిత వ్యయాలకు ఆర్థిక సాయం చేసే ఉద్దేశంతో అడ్వాన్స్‌ ఇన్‌స్టాల్‌మెంట్‌ విడుదల చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. కాగా.. పన్నుల వాటాలో ఉత్తరప్రదేశ్‌కు అత్యధికంగా రూ.31,000 కోట్లు దక్కగా... గోవాకు అత్యల్పంగా రూ.688 కోట్లు వచ్చాయి. నిబంధనల ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరంలో 14 వాయిదాల్లో కేంద్ర పన్నుల వాటాను రాష్ర్టాలకు విడుదల చేసే వెసులుబాటు ఉంటుంది. 11 నెలల్లో 11 వాయిదాలతో పాటు మార్చిలో మూడు సార్లు పన్నుల వాటాను కేంద్రం విడుదల చేస్తూ వస్తోంది. ఈసారి మాత్రం పండుగల నేపథ్యంలో ముందస్తుగానే డబుల్‌ బొనాంజాను ప్రకటించింది.

Updated Date - Oct 11 , 2024 | 03:33 AM