ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Republic day 2024: ఏపీలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా ఎన్నికల సంఘం శకటం

ABN, Publish Date - Jan 26 , 2024 | 10:10 AM

Andhrapradesh: రాష్ట్ర వ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతీచోట త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. ఇందిరాగాంధీ స్టేడియంలో రిపబ్లిక్‌ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించారు.

అమరావతి, జనవరి 26: రాష్ట్ర వ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు (Republic Day 2024) ఘనంగా జరుగుతున్నాయి. ప్రతీచోట త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. ఇందిరాగాంధీ స్టేడియంలో రిపబ్లిక్‌ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ (Governor Abdul Nazir) త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించారు. గణతంత్ర వేడుకలకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి (CM Jaganmohan Reddy), ఆయన సతీమణి భారతి, మంత్రులు, అధికారులు హాజరయ్యారు.

జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని గవర్నర్ నజీర్ స్వీకరించారు. అలాగే ఓపెన్ టాప్ జీపులో గవర్నర్ పరేడ్ రివ్యూ చేశారు. ఇండియన్ ఆర్మీ కంటింజెంట్‌, సీఆర్పీఎఫ్ కంటింజెంట్, తమిళనాడు స్టేట్ పోలీస్ స్పెషల్ కంటింజెంట్ సహా కొన్ని కంటింజెంట్‌లను గవర్నర్ రివ్యూ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గవర్నర్‌కు అధికారులు వివరించారు. ఆపై పరేడ్‌లో వివిధ శాఖలకు చెందిన శకటాలు ప్రదర్శన జరిగింది. ఈ శకటాల ప్రదర్శనలో ఎన్నికల సంఘం శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓటు ఆవశ్యకతను తెలియజేసేలా శకటాన్ని రూపొందించారు. గవర్నర్, జగన్ సహా పలువురు శకటాల ప్రదర్శనను తిలకించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 26 , 2024 | 10:15 AM

Advertising
Advertising